Home /News /trending /

INSTAGRAM INFLUENCER BOBBY KATARIA SEEN SMOKING CIGARETTE ON SPICEJET PLANE FIR FILED VIDEO GOES VIRAL PAH

వామ్మో.. స్పైస్ జెట్ విమానంలో దమ్ముకొడుతున్న ప్రయాణికుడు.. వీడియో వైరల్..

విమానంలో సిగరెట్ కాలుస్తున్న బాబీ కటారియా

విమానంలో సిగరెట్ కాలుస్తున్న బాబీ కటారియా

SpiceJet: విమానంలో ఒక వ్యక్తి తనకు కేటాయించిన సీటులో కూర్చున్నాడు. అక్కడ సీక్రెట్ గా ధూమపానం చేస్తున్నాడు. అంతేకాకుండా తన ఘనకార్యాన్ని వీడియో కూడా తీసుకున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India
గత కొన్నిరోజులుగా స్పైస్ జెట్ విమానాలు (SpiceJet Plane)  నిరంతరంలో ఏదో ఘటనతో వార్తలలో ఉంటున్నాయి. కొన్నిసార్లు.. విమానం ఇంజిన్ పాడైపోవడం, ఇంధనం అయిపోవడం, వాతావరణ పరిస్థితులు బాగాలేక అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. మరికొన్నిసార్లు.. విమానంలో గాల్లో ఉండగా పక్షి వచ్చి విమానం రెక్కను బలంగా ఢీకొట్టింది. గాల్లో ఉండగా సాంకేతిక కారణాలతో మంటలు చెలరేగడం వంటివి మనకు తెలిసింది. తాజాగా, మరో ఘటనతో ప్రస్తుతం స్పైస్ జెట్ విమానం మరోసారి వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తున్న స్పైస్ జెట్ విమానంలో ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral news) మారింది. పసుపు రంగు టీషర్ట్ ధరించి,సీటుపై పడుకుని ఉన్న వ్యక్తి... తన నోటిలో సిగరెట్ పెట్టుకుని దమ్ముకొడుతున్నాడు. ఈ ధుమాపానంకు పాల్పడిన వ్యక్తి గురుగ్రామ్ లో ఉండే బాబీ కటారియాగా ఎయిర్ వేస్ అధికారులు గుర్తించారు. అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడని , ఇతనికి లక్షల్లో మంది ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వీడియో వైరల్ కావడంతో ఇది కాస్త డీజీసీఎ అధికారుల వరకు వెళ్లింది. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు.





ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ గాలిలో ప్రమాదం జరిగిఉంటే.. ఎంతటి ఘోరం జరిగి ఉండేదని ఆయన అన్నారు. ఇలాంటి ప్రమాదకర ప్రవర్తనను సహించేది లేదని సింధియా ట్వీట్‌లో హామీ ఇచ్చారు. భారత వాయు భద్రతా నియమాల ప్రకారం, తెలియని వారికి, దేశీయ విమానాలలో ధూమపానం అనుమతించబడదు. ఈ వీడియో సోషల్ మీడియా నెటిజన్లకు.. కోపం తెప్పించింది. విమానం క్యాబిన్లో సిగరేట్ తాగుతున్నప్పుడు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని అన్నారు. అంతే కాకుండా.. అతనితో పాటు..తోటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పువాటిల్లేదని అన్నారు. ఇంత జరుగుతుంటే.. విమానంలో ఉన్న ఎయిర్ హోస్టేస్, ఇతర సిబ్బంది ఏంచేస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Delhi, SpiceJet, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు