Moon Land: భార్యకు అదిరే వెడ్డింగ్ గిఫ్ట్... చందమామపై స్థలం కొన్న పాకిస్థాన్ యువకుడు

Land on Moon: అనుమానాస్పద స్థితిలో చనిపోయిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని ఆదర్శంగా తీసుకున్న ఆ పాకిస్థాన్ యువకుడు... తన భార్యకు పెళ్లి గిఫ్టుగా చందమామపై స్థలం కొని ఇచ్చాడు.

news18-telugu
Updated: September 23, 2020, 1:49 PM IST
Moon Land: భార్యకు అదిరే వెడ్డింగ్ గిఫ్ట్... చందమామపై స్థలం కొన్న పాకిస్థాన్ యువకుడు
చందమామపై స్థలం కొన్న పాకిస్థాన్ యువకుడు (credit - twitter)
  • Share this:
Land on Moon: భార్యపై ప్రేమను చాటుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్రయత్నిస్తారు. కొందరు వాహనాలు కొంటారు. ఇంకొందరు గిఫ్టులు కొంటారు. కానీ... చందమామపై స్థలం కొనాలని మాత్రం ఎవరూ అనుకోరు. ఎందుకంటే... అది నలుగురికీ చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ... ఆ స్థలాన్ని వాడుకునే ఛాన్సే ఉండదు. పాకిస్థాన్‌... రావల్పిండిలో నివసించే... సొహైబ్ అహ్మద్... తన భార్యకు పెళ్లి గిఫ్టుగా చందమామపై ఎకరం స్థలం కొని ఇచ్చాడు. చందమామపై సీ ఆఫ్ వేపర్ (Sea of Vapour) అనే ప్రదేశంలో ఆ స్థలం కొన్నాడు. ఇంటర్నేషనల్ ల్యూనార్ లాండ్స్ రిజిస్ట్రీలో ఆ స్థలాన్ని రూ.3300కి కొన్నాడు. ఏంటీ... ఎకరం స్థలం రూ.3వేలేనా అనుకుంటున్నారా... అంతేమరి... చందమామపై ఇంకా ఎవరూ ఇళ్లు కట్టలేదు కదా... అందువల్ల అక్కడ స్థలాల ధరలు తక్కువగానే ఉన్నాయి.

మీకు తెలిసే ఉంటుంది. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌కి గ్రహాలు, అంతరిక్షం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే... 2018లో సుశాంత్... చందమామపై... మారే ముస్కోవీన్స్ (Mare Muscoviense) ప్రాంతంలో స్థలం కొన్నాడు. ఆ ప్రాంతాన్ని సీ ఆఫ్ ముస్కోవీ (Sea of Muscovy) అని కూడా పిలుస్తారు. హాలీవుడ్ నటులు టామ్ క్రూజ్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సహా చాలా మంది చంద్రుడిపై స్థలాలు కొనుక్కున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని ప్రేరణగా తీసుకొని సొహైబ్... కూడా మూన్ ల్యాండ్ కొన్నాడు.ఈ విషయాన్ని సొహైబ్ భార్య మదీనా... తన ఫ్రెండ్స్‌కి చెప్పిందట. "ఛ... జోకులెయ్యకు" అన్నారట ఫ్రెండ్స్. ఇది జోకు కాదు నిజమే అని ఆమె వివరంగా చెప్పాక, డాక్యుమెంట్లు చూపించాక... ఆశ్చర్యపోవడం వాళ్ల వంతైంది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లోని సుమా టీవీకి ఆమె తెలిపింది. ఇప్పుడు ఆమె ఫ్రెండ్సంతా... తమకు కూడా చందమామపై స్థలం కొనిపెట్టమని తమ భర్తల్ని అడుగుతున్నారట. "ఇదెక్కడి గోలరా బాబూ" అనుకుంటున్నారట వాళ్లు.అమెరికా పోస్టల్ సర్వీస్ ద్వారా... ఈ కొత్త జంటకు మూన్ ల్యాండ్ డాక్యుమెంట్స్ వచ్చాయి. ఇదివరకు బీహార్ వ్యాపారి నీరజ్ కుమార్ కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని ప్రేరణగా తీసుకొని ఓ ఎకరం కొనేశాడు. చాలా చీపుగా వచ్చేసిందని సంబరపడ్డాడు. అమెరికాలోని ల్యూనా సొసైటీ ఇంటర్నేషనల్‌కి స్థలం కావాలని 2019 అక్టోబర్‌లో అప్లై చేసుకున్నాడు. అంతే... కొనేశాడు.

"నేను ఆ స్థలం కోసం రూ.48000 ఖర్చు పెట్టాను. డాలర్లలో డబ్బు చెల్లించేందుకు డబ్బును కన్వర్ట్ చేశాను. దానికి చాలా ఆన్‌లైన్ పేపర్ వర్క్ ఉంది. అదంతా పూర్తి చేశాక... జులై 4, 2020లో నాకు డీల్ సెట్ అయ్యినట్లు, స్థలం నా పేరున రిజిస్టర్ అయినట్లు డాక్యుమెంట్లు వచ్చాయి" అని నీరజ్ కుమార్ ANI వార్తా సంస్థకు తెలిపాడు.

ఇదంతా చదివాక... మీకూ చందమామపై స్థలం కొనుక్కోవాలని ఉందా... అక్కడికి వెళ్లలేంగా అని అనుకుంటున్నారా... మరేం పర్లేదు... 2024లో నాసా మనుషుల్ని పంపబోతోంది. ఆ తర్వాత కాలనీల నిర్మాణాలు మొదలవుతాయని అనుకోవచ్చు.
Published by: Krishna Kumar N
First published: September 23, 2020, 1:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading