Home /News /trending /

INNOVATIVE FIRE DOSA ATTRACTING FOOD LOVERS IN INDORE CITY OF MADHYA PRADESH FULL DETAILS HERE PRN GH

Fire Dosa: అదుర్స్ అనిపిస్తున్న ఫైర్ దోశ... దీన్ని ఎలా తయారుచేస్తున్నారో చూసేయండి..

ఫైర్ దోశ (Photo Credit: Instagram)

ఫైర్ దోశ (Photo Credit: Instagram)

South Indian Recipes: సౌత్ ఇండియన్ స్టైల్ వంటల రుచేవేరు. అలాంటి వాటిలో దోశ చాలా ముఖ్యమైనది. సింపుల్ గా తినాలనుకుంటే ప్లెయిన్ దోశ దగ్గర్నుంచి భారీగా ఉండే అతి పెద్ద దోశలు, బాహుబలి, ఫ్లైయింగ్ దోశలు ఉన్నాయి.

భారతీయులు భోజన ప్రియులు.. రకరకాలుగా వంటలు చేసి రుచులను ఆస్వాదిస్తుంటారు. ప్రపంచంలో భారతీయ వంటలకు చాలా ప్రత్యేకత ఉంది. వంటను సంస్కృతిలో భాగం చేసిన ఘనత మనదేశానిదే. ఇక సౌత్ ఇండియన్ స్టైల్ వంటల రుచేవేరు. అలాంటి వాటిలో దోశ చాలా ముఖ్యమైనది. సింపుల్ గా తినాలనుకుంటే ప్లెయిన్ దోశ దగ్గర్నుంచి భారీగా ఉండే అతి పెద్ద దోశలు, బాహుబలి, ఫ్లైయింగ్ దోశలు ఎన్నో మనం గమనించాం. దోశలోని ఎన్నో వెరైటీలు తిన్నా చాలామంది సహజమైన దోశ, సాంబార్, కొబ్బరి చట్నీ కాంబినేషన్ ని ఇష్టపడతారు. సంప్రదాయబద్ధంగా తయారుచేసిన దోశపై బంగాళాదుంప మసాలా ఫిల్లింగ్, నోరూరించే కరకరలాడే ఉల్లిపాయలు అన్నీ ఆకట్టుకుంటాయి. అయితే కొత్త రుచులను ట్రై చేయాలన్న కోరిక ఉన్నవారి కోసం షేజ్వాన్ దోశ, చాక్లెట్ దోశ, నూడుల్స్ దోశ లాంటివి తయారు చేశారు చాలామంది చెఫ్‌లు. తాజాగా ఇలా వస్తున్న కొత్త దోశల రకాల్లో ఒకటి ఫైర్ దోశ. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దీనికి ఫ్యాన్స్ విపరీతంగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ తరహా దోశ తయరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

ప్రముఖ ఫుడ్ బ్లాగర్ ఫుడ్ ఇంకార్నేట్ షేర్ చేసిన ఈ ఫైర్ దోశ వీడియో ఇప్పటికే ఆరున్నర లక్షల వ్యూస్ తో పాటు 50 వేలకు పైగా లైక్స్ సంపాదించింది. ఇండోర్‌ దోశ క్రాఫ్ట్‌కి చెందిన ఈ సరికొత్త దోశ ధర రూ. 180 మాత్రమేనట. దీన్ని తయారు చేసేటప్పుడు చూస్తే కళ్లకు విందుగా అనిపిస్తుంది. చుట్టూ మంటపెట్టి మధ్యలో దోశ ఉంచి దాన్ని కాల్చడం చూస్తుంటే కొత్తగా, అద్భుతంగా అనిపిస్తుంది.






ఈ వీడియో ప్రకారం దోశను తయారు చేసే విధానం చూస్తే.. అంతకుముందే వేడి చేసిన పెనం మీద దోశ పిండిని పోసి బాగా తిప్పి పెద్ద దోశను తయారుచేశారు. ఆ తర్వాత దానిపై కొన్ని మసాలాలు, కూరగాయలు, ఛీజ్, మొక్కజొన్న గింజలు, సాసెస్ కూడా చేర్చారు. అనంతరం పెద్ద మంటపై దోశను బాగా కాలనిచ్చారు. పెనం చుట్టూ దట్టంగా మంటలు వచ్చేలా చేసి, ఆ మంటతో దోశ మొత్తాన్ని సెకన్లలో కాల్చారు. ఆఖరికి ఛీజ్‌తో గార్నిష్, రోల్ చేసి సర్వ్ చేశారు.

ఈ ఫైర్ దోశ తినేందుకు ఎలా ఉంటుందో కానీ దీని తయారీ మాత్రం చాలా స్పెషల్ గా ఉంది. కళ్లకు అందంగా కనిపిస్తేనే రుచి కూడా పెరుగుతుందనేందుకు ఇది ఒక ఉదాహరణ. మీరూ ఎప్పుడైనా ఇండోర్ వెళ్తే ఈ స్పెషల్ దోశను ఓసారి రుచి చూసేయండి.
Published by:Purna Chandra
First published:

Tags: Dosa, Indore, Life Style, Madhya pradesh

తదుపరి వార్తలు