సైకిళ్లపై స్టంట్... అదుర్స్ అంటున్న నెటిజన్లు... సూపర్ వైరల్ వీడియో

ఇదివరకు ఎవరైనా చేసిన స్టంట్‌ని మరొకరు చేస్తే... మనకు అది అంత థ్రిల్ ఇవ్వదు. అందుకే వాళ్లు కొత్తగా ట్రై చేశారు.

news18-telugu
Updated: July 4, 2020, 2:55 PM IST
సైకిళ్లపై స్టంట్... అదుర్స్ అంటున్న నెటిజన్లు... సూపర్ వైరల్ వీడియో
సైకిళ్లపై స్టంట్... అదుర్స్ అంటున్న నెటిజన్లు... సూపర్ వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
వైరల్ వీడియోల్లో మరో సెన్సేషనల్ వీడియో మన ముందుకి వచ్చింది. అందులో ఓ యువతి... సైకిళ్లపై వెళ్తున్న యువకులకు ఎదురెళ్లింది... మెరుపు వేగంతో... సైకిళ్ల నుంచి యువకులపైకి ఎక్కి... వాళ్ల పై నుంచి పరుగెత్తింది. ఆ యువకులంతా ఆమె కింద పడకుండా అత్యంత జాగ్రత్తగా సైకిళ్లను వరుసగా నడిపారు. ఆమె తమపై నుంచి నడిచి వెళ్లేలా... అందరూ ముందుకు వంగుతూ... బ్యాలెన్స్ చేశారు. దాంతో ఆ యువతి... అందరి పైనుంచి అలా గాల్లో నడుస్తూ... వెళ్లడాన్ని చూసిన నెటిజన్లు కళ్లతో నమ్మలేకపోతున్నారు. భలే వెళ్లిందే... వావ్ అంటున్నారు. మళ్లీ మళ్లీ చూస్తూ... సూపర్ స్టంట్. ఇలాంటిది ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అని మెచ్చుకుంటున్నారు.


ఈ స్టంట్‌ని ఎవరూ ప్రయత్నించకపోవడమే మంచిది. ఎందుకంటే... ఇలా నడుస్తున్న సమయంలో... ఆ యువతి... పొరపాటున జారి ఉంటే... తీవ్ర ప్రమాదమే జరిగేది. ఎందుకంటే... ఆమె కింద పడితే... పట్టుకోవడానికి ఎవరూ లేరు. పైగా... కింద ఉన్నవి సైకిళ్లు... వాటి మధ్య పడితే... ప్రమాదం. ఈ పరిస్థితుల్లో ఆమె కింద పడకుండా... ఆమె నడుం చుట్టూ ఓ స్ట్రింగ్ లాంటిది ఏర్పాటు చేశారు. అందువల్ల ఆ టీమ్... ఎంతో జాగ్రత్తగా ఈ స్టంట్ చేసి చూపించింది. దీని కోసం ఎన్నోసార్లు ట్రయల్స్ వేసి... ఎన్నోసార్లు తడబడి... చివరకు సక్సెస్‌ఫుల్‌గా చేసింది. .
అంత అరుదైనది, కష్టమైనది చేశారు కాబట్టే ఈ వీడియో అందరికీ నచ్చుతోంది. దీన్ని ఒక్క రోజులోనే 35 లక్షల మంది చూశారు. లక్ష మందికి పైగా లైక్ చేశారు. 25వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. 1800 మందికి పైగా కామెంట్లు రాశారు.
Published by: Krishna Kumar N
First published: July 4, 2020, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading