పాపం.. కుక్కర్‌లో ఇరుక్కుపోయిన పిల్లాడి తల.. చివరకు ఏమైందో తెలుసా?

కుక్కర్‌లో ఇరుక్కుపోయిన పిల్లాడి తల

Viral: పిల్లలకు ఏది ఆటవస్తువో, ఏది ప్రమాదకరమో తెలియదు. అదే పనిగా వారిని గమనిస్తూ ఉండటం పేరెంట్స్ వల్ల కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిన్నారికి ఏమైందో చూడండి.

 • Share this:
  అది ఉత్తరప్రదేశ్.. ఆగ్రా (Agra).... తాజ్ నగరి ఏరియా. అక్కడి ఓ ఇంట్లో... 18 నెలల పిల్లాడు... ఉన్నట్టుండి గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టాడు. ఏ చీమో కుట్టిందేమో అనుకుంది తల్లి. తీరా పక్క గదిలోకి వచ్చి చూస్తే... పిల్లాడి తల కనిపించట్లేదు. అక్కడ కుక్కర్ (Cooker) ఉంది. అయోమయంగా చూసిన తల్లి... దగ్గరకు వెళ్లి చూస్తే... కుక్కర్‌లో చిట్టి తండ్రి తల ఇరుక్కుపోయి ఉంది. ఏడ్వకు నాన్నా నేను వచ్చేశాగా అంటూ ఆ తల్లి (mother)... చిన్నారికి ధైర్యం చెప్పి... కుక్కర్‌ను తల నుంచి తీద్దామని ప్రయత్నించింది. కానీ అది రావట్లేదు. చిన్నారి ఏడుపూ ఆగట్లేదు.

  మిగతా కుటుంబ సభ్యులు కూడా ఏమైందంటూ వచ్చారు. అందరిలోనూ ఆందోళన. తల్లేమో... కొబ్బరి నూనె ఇతరత్రా పిల్లాడి మెడకు రాసి... కుక్కర్‌ను పైకి తీద్దామని ప్రయత్నిస్తుంటే... ఏమాత్రం ఫలితం కనిపించట్లేదు. నేను చూస్తా, నేను తీస్తా అంటూ... మిగతా సభ్యులు (family members) కూడా ప్రయత్నించారు. ఎవ్వరి వల్లా కాలేదు. ఆ పసిబిడ్డ భయంతో ఏడుస్తున్నాడు. ఎలా ధైర్యం చెప్పాలో వాళ్లకు అర్థం కావట్లేదు. అలా ఎలా ఇరుక్కుపోయిందని పెద్దవాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంట్లో అందరిలోనూ ఆందోళన (panic).

  ఇక లాభం లేదు డాక్టర్ (Doctor) దగ్గరకు తీసుకెళ్దాం. వాళ్ల దగ్గర ఏవో ఒకటి ఉంటాయి అనుకున్నారు. చిన్నారి పేరు హసన్ రజా. కోసి కళ మథురలో వాళ్ల ఇల్లుంది. శుక్రవారం ఇది జరిగింది. పిల్లాడు ఆడుకుంటూ... తలను కుక్కర్‌లో పెట్టాడు. దగ్గర్లోని MM చారిటబుల్ ఆస్పత్రి (M M Charitable Hospital)కి తీసుకెళ్లారు. డాక్టర్లు మొదట ఈజీగానే తీసేయవచ్చు అనుకున్నారు. ఎందుకంటే... కుక్కర్‌లోకి తల ఎలా దూరిందో.. అదే విధంగా వెనక్కి లాగేస్తే పనైపోతుంది అనుకున్నారు. తీరా ప్రాక్టీస్ మొదలుపెట్టాక... అస్సలు వీలుకాలేదు. తమ దగ్గరున్న రకరకాల వైద్య పరికరాలతో ట్రై చేసినా ఫలితం రాలేదు.

  ఇవతల కుటుంబ సభ్యులకు కాళ్లూ, చేతులూ ఆడట్లేదు. ఇక లాభం లేదన్న డాక్టర్... అదే కరెక్ట్ అన్నారు. ఏంటది అని అడిగితే.. గ్లైడర్ మెషిన్ (glider machine) అన్నారు.

  "ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు మేము చిన్నారిని స్పృహ తప్పకుండా చెయ్యలేని పరిస్థితి. చిన్నారి మెలకువగా ఉంటే మేం ఆ కుక్కర్ తియ్యడం సాధ్యం కాలేదు. పిల్లాడు కంటిన్యూగా అటూ ఇటూ కదులుతూనే (moving head) ఉన్నాడు. అందువల్ల పని జరగలేదు. పిల్లల తల చాలా మెత్తగా ఉంటుంది. జాగ్రత్తగా చెయ్యకపోతే ప్రాణాలకే ప్రమాదం. అందువల్ల మేం యంత్రాన్ని ఉపయోగించి.. చాలా జాగ్రత్తగా కుక్కర్‌ను కట్ (cut) చెయ్యాల్సి వచ్చింది. మొత్తానికి తల ఇరుక్కున్న 2 గంటల తర్వాత కుక్కర్‌ను విరగ్గొట్టడం ద్వారా ప్రమాదం నుంచి తప్పించాం. ఆ కుటుంబ సభ్యులు సంపన్నులు కారు. అందువల్ల మేము ఫీజు కూడా తీసుకోలేదు" అని డాక్టర్ ఫరాత్ ఖాన్ తెలిపారు.

  ఇది కూడా చదవండి: Mars: అంగారక గ్రహంపై విరిగిపడిన కొండ చరియలు.. ఫొటోలు చూడండి

  మొత్తానికి ఎలాంటి గాయాలూ అవ్వకుండా చిన్నారి తల నుంచి కుక్కర్ తీసేశారు. ఇందుకు ఒక్క రూపాయి (single rupee) మాత్రమే ఛార్జీ తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలకు వస్తువులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు కీడెంచి, మేలెంచాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: