హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking: అయ్యో పాపం.. ఆస్పత్రికి తీసుకొచ్చి ప్రాణాలు తీసిన అంబులెన్స్..

Shocking: అయ్యో పాపం.. ఆస్పత్రికి తీసుకొచ్చి ప్రాణాలు తీసిన అంబులెన్స్..

కోయమోన్ (ఫైల్)

కోయమోన్ (ఫైల్)

Kerala: బాధితుడు రోడ్డుప్రమాదం జరగటంతో అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఎమర్జెన్సీకి సర్వీస్ కు కాల్ చేశారు. వెంటనే అంబూలెన్స్ వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

కొన్నిసార్లు ఎమర్జెన్సీ సమయాల్లో ఊహించని సంఘనలు జరుగుతుంటాయి. రోడ్డుపైన ఎవరైన అనుకొని ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు బాధితులను ఆస్పత్రికి చేర్చే, అంబూలెన్స్ లు కూడా తరచుగా ప్రమాదాల బారినపడుతుంటాయి. బాధితుడి ప్రాణాలు కాపాడాలని అంబూలెన్స్ సిబ్బంది వేగంగా పొనిస్తారు. వీరికి ట్రాఫిక్ తో ఏ మాత్రం సంబంధం ఉండదు. గట్టిగా సైరన్ ఇచ్చుకుంటూ రోడ్డుపైన వెళ్లిపోతుంటారు. అయితే.. కొన్నిసార్లు.. అంబూ లెన్స్ లు ఇతర వాహానాలను ఢీకొడుతుంటాయి. అదే విధంగా మరికొన్నిసార్లు.. అదుపుతప్పి బోర్లా పడుతుంటాయి. ఇంకొన్నిసార్లు అంబూలెన్స్ సిబ్బంది కేర్ లేస్ వలన షాకింగ్ సంఘటనలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. కేరళలోని (Kerala)  కోజీకోడ్ లో దారుణమైన ఘటన జరిగింది. స్థానికంగా ఉండే ఫిరోక్ చెందిన కోయమోన్ అనే వ్యక్తికి స్యూటర్ ఢీకొట్టడంతో అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని స్థానికులు భావించారు. దీని కోసం అంబూలెన్స్ కు కాల్ చేశారు. అప్పుడు.. అంబూలెన్స్ ప్రభుత్వ వైద్యకళాశాలకు వెళ్లేందుకు వేగంగా డ్రైవర్ తీసుకెళ్తున్నాడు. తొందరగానే అక్కడికి చేరుకున్నాడు. అయితే.. ఆస్పత్రికి చేరుకున్నాక షాకింగ్ ఘటన ఎదురైంది.



ఎంత సేపటికి అంబూలేన్స్ డోర్ తెరుచుకోలేదు. దాదాపు.. అరగంట సేపు ట్రై చేసిన.. డోర్ మాత్రం ఓపేన్ కాలేదు. దీంతో వాహనంలోనే, బాధితుడి ఆరోగ్యం మరింత దిగజారీంది. చివరకు ఎలాగో డోర్ తెరిచి, బాధితుడిని ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి ఆసుపత్రి నుంచి ఇప్పటివరకు తమకు సమాచారం అందలేదని మెడికల్ కాలేజీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు.


ఇదిలా ఉండగా  జమ్ముకశ్మీర్ లోని (Jammu kashmir) కిష్త్వార్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది.


స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్ యూవీ) వెహికిల్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా లోతైన లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఐదుగురు, మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, చింగం నుంచి ఛత్రూకు ప్రయాణీకులను తీసుకెళ్తున్న ఎస్‌యూవీ మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో బోండా గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైందని అధికారి తెలిపారు. పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ అధికారులు అక్కడికి చేరుకున్నారు.


స్థానిక గ్రామస్తులతో కలిసి రెస్క్యూ నిర్వహించారు. ప్రధానంగా వీరంతా.. టీమ్‌లు వాహనం కొండ రహదారి నుండి క్రిందికి పడిపోయిన వెంటనే ఆపరేషన్ ప్రారంభించారు. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారని, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.



First published:

Tags: Free ambulance, Hospitalised, Kerala, VIRAL NEWS

ఉత్తమ కథలు