హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Russia Ukraine War: పుతిన్ కు మరో భారీ షాక్.. రష్యాకు గుడ్ బై చెప్పిన దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ.. కారణం అదే..

Russia Ukraine War: పుతిన్ కు మరో భారీ షాక్.. రష్యాకు గుడ్ బై చెప్పిన దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ.. కారణం అదే..

ఐటీ సంస్థ తరలింపు

ఐటీ సంస్థ తరలింపు

Ukraine Invasion: రష్యా సైన్యం, ఉక్రెయిన్ పై భీకర దాడులు కొనసాగిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు, పలు కంపెనీలు రష్యాపై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇక తాజాగా, వాటి సరసన దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ కూడా వచ్చి చేరింది.

Infosys To Move Out Of Russia: రష్యా నెలన్నర రోజులకు పైగా దాడులతో ఉక్రెయిన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రపంచ దేశాలు, పుతిన్ మారణ హోమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పలు దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇక కొన్ని మాస్టర్ కార్ట్ , రూపే వంటి పలు కంపెనీలు అక్కడ తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఇక తాజాగా, దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్పోసిస్ ఏకంగా రష్యా నుంచి తమ కంపెనీలను శాశ్వతంగా వేరే చోటికి తరలిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

ఉక్రెయిన్ , రష్యా సంక్షోభం వలన ఇప్పటికే ఒరాకిల్ కార్ప్, సాప్ ఎస్ఈ తో సహా పలు గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలను తాత్కలికంగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఇక ఇన్ఫోసిస్ సీఈఓ , మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ బుధవారం కీలక ప్రకటన చేశారు. గత త్రైమాసిక ఫలితాలను చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యాలోని ఇన్ఫోసిస్ శాఖలో 100 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అక్కడ మాకు క్లయింట్ లు కూడా లేరన్నారు. తమ కంపెనీ అభివృద్ధి కోసం మార్పు తప్పదని తెలిపారు.

పుతిన్ తన అధికార దురాహాంకారంతో ఉక్రెయిన్ ను పూర్తిగా నాశనం చేస్తున్నారు. దీనిలో సామాన్య ప్రజలు , అమాయకులు సమిధలుగా మారుతున్నారు. నెల రోజులకు పైగా రష్యన్ సైన్యాలు ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ లోని ముఖ్య నగరాలన్ని బాంబులు, క్షిపణుల మోతకు వాటి రూపురేఖలను కొల్పోయాయి. పుతిన్ (Vladimir putine) దురహాంకారాన్నిప్రపంచ దేశాలు వ్యతిరేకించిన ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఇప్పటికే పలు దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్ కు పరోక్షంగా సహాయం చేస్తున్నాయి. రష్యన్ భీకర దాడుల వలన కోట్లాది ప్రజలు తమ దేశం విడిచి పెట్టి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. అదే విధంగా కొన్ని చోట్ల యువతులు, మహిళలు తీవ్రమైన దాడులను ఎదుర్కొంటున్నారు.

కీవ్, మరియూపోల్ వంటి పలు నగరాలు శవాల దిబ్బలుగా మారాయి. ఆస్పత్రులు, నివాస భవనాలు అన్నింటిని పుతిన్ సైన్యం నాశనం చేస్తుంది. దీనికి తోడు రష్యా సైనికులు దురాగతాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి. ఎందరో మహిళలపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అమాయకులను పట్టుకుని బలవంతంగా అనుభవించు కుంటు పశువాంఛను తీర్చుకుంటున్నారు. మరికొందరిని ఊచకొత కొస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Infosys, Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు