పిల్లాడి మెడలో గుచ్చుకున్న చేప... షాకింగ్ సీన్...

చేపల కూర తింటున్నప్పుడు... చేప ముల్లు గొంతులో గుచ్చుకోవడం వినే ఉంటారు. ఇది దానికి భిన్నం. చేపే స్వయంగా వచ్చి... పిల్లాడి మెడలో గుచ్చుకుపోయి అలా ఉండిపోయింది.

news18-telugu
Updated: January 28, 2020, 7:07 AM IST
పిల్లాడి మెడలో గుచ్చుకున్న చేప... షాకింగ్ సీన్...
పిల్లాడి మెడలో గుచ్చుకున్న చేప... షాకింగ్ సీన్... (credit - twitter - M.O.F)
  • Share this:
ఈ చిత్రమైన, నమ్మలేని నిజం జరిగింది ఇండోనేసియాలో. ఇదుల్ అనే పిల్లాడు... సరదాగా చేపలు పట్టేందుకు ఫ్రెండుతో కలిసి వెళ్లాడు. ఇద్దరూ నీటిలో దిగారు. చేపలు అటూ ఇటూ కదులుతున్నాయి. అది పట్టుకుందాం, ఇది పట్టుకుందాం అని అటూ ఇటూ చేపల వెనక పరిగెడుతున్నారు. ఇంతలో... ఓ నీడిల్ చేప (Needle Fish) సర్రున నీటిలోంచీ పైకి ఎగిరి... ఇదుల్ మెడలోకి దూసుకెళ్లింది. ఆ చేప మూతి... సూదిలా పొడుగ్గా ఉంటుంది. అందువల్ల అది మెడలో గుచ్చుకుపోయింది. అది చూసిన ఇదుల్ ఫ్రెండ్ మనలాగే షాక్ అయ్యాడు. చేపను వెనక్కి లాగితే... మరింత ఎక్కువ బ్లడ్ వచ్చేస్తుందేమో అని భయపడి... ఆ చేపని కదలనివ్వకుండా పట్టుకొని... దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అదో చిన్న ఆస్పత్రి. అందులో డాక్టర్... ఇదుల్‌ని చూడగానే షాక్ అయ్యాడు. అలా ఎలా జరిగింది అంటూ విచిత్రంగా చూస్తూ... చేపను వెనక్కి లాగుదామని ట్రై చేశాడు. తన దగ్గరున్న పరికరాలను ఉపయోగించి చూశాడు. ఏకంగా మెడ విరిగిపోయే పరిస్థితి వచ్చింది. అమ్మో అనుకున్న డాక్టర్... ఇలా కాదని... చేప మూతిని కట్ చేశాడు. ఆ తర్వాత ఇదుల్‌ని దగ్గర్లోని పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సర్జరీ చేసి... చేప ముక్కును బయటకు తీశారు.


ఇలాంటి కేసు ఇదే మొదటిదంట. గంటపాటూ కష్టపడితేగానీ చేప ముక్కును వెనక్కి తియ్యలేకపోయారు. ఇదంతా జరిగింది ఐదు రోజుల కిందట. ఇప్పుడు విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇదుల్ పరిస్థితి మెరుగైంది. ఐతే... ఇన్ఫెక్షన్, సైడ్ ఎఫెక్ట్స్ వంటివి వచ్చాయా అన్నది తెలుసుకోవడానికి ఆ పిల్లాడిపై మరిన్ని పరీక్షలు జరపనున్నారు. మొత్తానికి చేపలు పట్టుకోవడానికి వెళ్తే... చేపే వచ్చి మెడలో గుచ్చుకోవడం దురదృష్టకరం. ఇంకా నయం ప్రాణాలు పోలేదు.

Video : వావ్...సూపర్ పోలీస్... స్టంట్స్ అదుర్స్...

Published by: Krishna Kumar N
First published: January 28, 2020, 7:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading