Home /News /trending /

INDONESIAN MAN MARRIES FEMALE GOAT WITH HOPES OF GOING VIRAL PAH

మేక మెడలో తాళి కట్టిన యువకుడు.. ఆ మూవీలో సీన్ రిపీట్... దాని కోసమే నట..

మేకతో పెళ్లి జరుగుతున్న పెళ్లితంతు

మేకతో పెళ్లి జరుగుతున్న పెళ్లితంతు

Indonesia: మేకను అందంగా అలంకరించారు. పెళ్లితంతు కార్యక్రమం జరుగుతుంది. చుట్టుపక్కల బంధువులు కూడా ఉన్నారు. పురోహితుడు పెళ్లి మంత్రాలను చదువుతున్నాడు.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ (Wedding) నడుస్తోంది. అయితే, ఇది మాత్రం నిజంగా వెరైటీ పెళ్లిగా చెప్పుకొవచ్చు. ఇలాంటి పెళ్లి వేడుకలు జరగటం చాలా అరుదు. గతంతో ఒక మూవీలో కూడా ఇలాంటి వింత పెళ్లి వేడుక జరిగింది. ఏవండి ఆవిడోచ్చింది.. సినిమా గుర్తుందా.. దానిలో బాబు మోహన్ ఒక గాడిదను పెళ్లి చేసుకుంటాడు. తన వివాహం లో ఉన్న దోషాన్ని పోగొట్టుకొవడానికి గాడిదతో పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత.. గాడిదను వదల్లేక దాని యజమాని ఫన్నీగా (Funny) ప్రవర్తిస్తాడు. ఆ సినిమాలోని ఘటనలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇప్పటికి ఆ సీన్ గుర్తుకు తెచ్చుకుంటే నవ్వోస్తుంటుంది. ఇప్పటికి అక్కడక్కడ పెళ్లి దోషాలు ఉంటే.. చెట్లతోను, కుండలతోను, నోరులేని జీవాలతోను పెళ్లిళ్లు చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఇండోనేషియాలో  (Indonesia) ఒక వింత ఘటన జరిగింది. బెంజెంగ్ జిల్లాలోని క్లాంపోక్ గ్రామంలో వెరైటీ పెళ్లి జరిగింది. స్థానికంగా ఉండే సైఫుల్ ఆరిఫ్ (44) అనే వ్యక్తి మేకను (Marriage with goat) పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి తంతు జూన్ 5 న జరిగింది. అతను ఒక శ్రీ రహాయు బిన్ బెజో అనే తెలుపు రంగు మేకను పెళ్లి చేసుకున్నాడు. మేకను అందంగా అలంకరించాడు. ఆ తర్వాత..పెళ్లికి చుట్టుపక్కల వారు కూడా వచ్చారు. వరుడు సైఫుల్ ఆరిఫ్, మేక పక్కన కూర్చున్నాడు.



పురోహితుడు పెళ్లి మంత్రాలు చదువుతున్నాడు. పెళ్లి గ్రాండ్ గా  (Marriage) జరుగుతుంది.ఈ ఘటన ఇండోనేషియాలోని లోకల్ యూట్యూబ్ లలో వైరల్ గా మారింది. దీంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, కొందరు మేకతో పెళ్లంటని ఆరా తీశారు. దీనికి అతగాడు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు. అతనికి ఎప్పటి నుంచో ఫేమస్ అవ్వాలని (Viral news)  ఉండేదని, అందుకే ఇలా వెరైటీ పెళ్లి చేసుకుంటే ఫేమస్ అవ్వోచ్చనే ఇలా చేశాడని అన్నాడు. దీంతో అక్కడి వారు నోరెళ్ల బెట్టారు. ప్రస్తుతం ఈ వింత పెళ్లి నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Indonesia, Trending news, VIRAL NEWS, Wedding

తదుపరి వార్తలు