Home /News /trending /

INDONESIA TORAJAN PEOPLE KEEPS DEAD BODY AT HOME OFFERS FOOD BATH EVERYDAY HERE IS INTERESTING STORY SK

Torajan People: అక్కడ ప్రతి ఇంట్లో మృతదేహం.. రోజూ స్నానం చేయించి.. భోజనం కూడా పెడతారు

ఇంట్లో మృతదేహం

ఇంట్లో మృతదేహం

Indonesia Toraja culture: మృతదేహానికి స్నానం చేయించి బట్టలు వేస్తారు. తాము భోజనం చేసే సమయంలో మృతదేహాలకు కూడా భోజనం పెడతారు. ఎండల వల్ల ఉబ్బరంగా అనిపిస్తే.. శవాలకు ఫ్యాన్ సైతం వేస్తారు.

    ఈ భూమండలంలో 195 దేశాలు ఉన్నాయి. మనుషుల వేషధారణ నుంచి ఆహార అలవాట్లు, పూజా విధానాలు, సంస్కృతి సంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి. ఐతే వాటిలో కొన్ని మాత్రం విచిత్రంగా ఉంటాయి. వాటిని చూస్తే..మనుషులు ఇలా కూడా ఉంటారా? ఇదేంటి బాబోయ్ అనిపిస్తుంటుంది. ఇండోనేసియాలో అలాంటి సంప్రదాయం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది అలాంటిది ఇలాంటిది కాదు. ఇక్కడి ప్రజలు కొందరు మృతదేహాలతో సహవాసం చేస్తారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి శవాలను ఖననం గానీ.. దహనం గానీ చేయరు. ఇంట్లోనే ఉంచుకుంటారు. అంతే కాదు.. ఆ మృతదేహాలను నిత్యం స్నానం చేయించి.. భోజనం కూడా పెడతారు. ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు షాకవుతున్నారు. ఇదెక్కడి సంప్రదాయమని షాక్ తింటున్నారు.



    ఇండోనేసియాలోని సౌత్ సులవేసిలోని కొండల్లో టొరాజా అనే తెగ నివసిస్తోంది. అక్కడి ప్రజల అలవాట్లు, సంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరి సంప్రదాయాల ప్రకారం.. ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు నిర్వహించరు. అతడి మృతదేహాన్ని తమ వద్దే ఉంచుకుంటారు. ఇంకా వారు జీవించి ఉన్నట్లుగానే భావిస్తారు. తమలో ఒకరిగా చూసుకుంటారు. మృతదేహానికి స్నానం చేయించి బట్టలు వేస్తారు. తాము భోజనం చేసే సమయంలో మృతదేహాలకు కూడా భోజనం పెడతారు. ప్లేట్స్‌లో ఆహార పదార్థాలను వడ్డించి శవం ముందు ఉంచుతారు. ఎండల వల్ల ఉబ్బరంగా అనిపిస్తే.. శవాలకు ఫ్యాన్ కూడా వేస్తారు.

    అయ్యో పాపం.. కిడ్నీ దానం చేస్తే.. ఆసుపత్రి ఎన్ని లక్షల బిల్లు వేసిందో చూడండి..

    వాస్తవానికి ఎవరూ చనిపోరని టొరాజన్ల నమ్మకం. కేవలం అనారోగ్యానికి గురయినట్లుగానే భావిస్తారు. ఇంట్లో అందరి ఇళ్లలోనూ మృతదేహాలు కనిపిస్తాయి. ఇంటికి ఎవరైనా వస్తే.. ఆ మృతదేహాలను చూసి వారి పరిస్థితి గురించి కూడా అడిగి తెలుసుకుంటారు. ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాారా? అని శవం గురించి ఆరా తీస్తారు. మృతదేహాన్ని ఇంట్లోని ఓ గదిలో భద్రపరుస్తారు. ప్రత్యేకమైన పెట్టెను చేయించి అందులో పడుకోబెడతారు. మనకు వింతలా అనిపించవచ్చు గానీ.. అక్కడి ప్రజలకు చాలా సాధారణమైన విషయం. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా మృతదేహంతో గడుపుతారు. దానిని కబుర్లు చెబుతారు. పిల్లలు కూడా భయపడరు. దానిని శవంగా అస్సలు భావించరు. తమ కుటుంబ సభ్యుడిగా చూస్తారు.



    High Court విచారణలో కూల్‌డ్రింక్ తాగిన పోలీస్.. జడ్జి అసహనం.. అనూహ్య శిక్ష!

    మరి ఇంట్లో శవం అన్ని రోజుల పాటు ఉంటే..అది కుళ్లిపోదా? అని మీకు డౌట్ రావొచ్చు. ఆ మృతదేహాలు కుళ్లిపోవు. ఎందుకంటే ప్రత్యేకమైన ఆకు పసర్లు, మందులను వాటికి రద్దుతారు. వాటి వలన మృతదేహాలు పాడుకావు. తాజాగా ఉంటాయి. వాటిని చూస్తే మృతదేహాలన్న అనుమానం కూడా రావు. నిద్రపోతున్నారని అనిపిస్తుంది. అంత బాగా చూసుకుంటారు. వారి మరణానికి సరైన సమయం వచ్చిందని భావిస్తే... అప్పుడు మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహిస్తారు. అప్పటి వరకు తమ వద్దే ఉంచుకుంటారు. సాధారణంగా వృద్ధాప్య కారణాలతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేస్తుంటారు. కానీ చిన్న వయసులోనే కన్నుమూపిన వారి మృతదేహాలను చాలా రోజుల పాటు తమ వద్దే ఉంచుకుంటారు. అతడి మరణానికి సరైన సమయం వచ్చిందని భావిస్తే.. అప్పుడే అంత్యక్రియలు చేస్తారు. మనలాగే వీరు శవాలను దహనం చేయరు. సమాధుల్లో పూడ్చిపెట్టారు. కొండల్లో ఉన్న బండరాళ్లను తొలిచి.. ఆ రంధ్రాల్లో శవపేటికలను ఉంచుతారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Indonesia, International, International news, Trending

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు