ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా కొంతమంది శారీరకంగా ఇబ్బందులు పడుతుంటే మరికొంతమంది మానసికంగా మదనపడుతున్నారు. ఇక ఆస్పత్రులలో ఉండే వైద్య సిబ్బంది బాధలు చెప్పనలవి కాదు. రోజులకు రోజులు వారి భాగస్వాములను వదిలి ఉంటున్న వైద్య సిబ్బంది.. బయటకు చెప్పలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు నర్సులు కోరికలను అనుచుకుంటుంటే.. మరికొంతమందేమో.. ఆ ప్రయత్నాలను చేయలేక అడ్డదారులు తొక్కుతున్నారు. ఏకంగా పేషెంట్లతోనే ఆ పని కానిచ్చేస్తున్నారు. ఇండోనేషియాలో ఒక నర్సు.. ఏకంగా కోవిడ్-19 సోకిన పేషెంట్ తోనే సెక్స్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే... ఇండోనేషియాలోని జకర్తాలో గల విస్మా అట్లెట్ క్వారంటైన్ కేంద్రంలో చోటుచేసుకుందీ ఘటన. ఇక్కడ నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ.. కరోనా వ్యాధి సోకి చికిత్స పొందుతున్న వ్యక్తితోనే సెక్స్ లో పాల్గొన్నది. కోవిడ్ పేషెంట్ ను టాయ్లెట్ లోకి తీసుకెళ్లిన నర్సు.. ఆ పై అతడితో ఆ పని కానిచ్చిందని ఆస్పత్రి అధికారుల విచారణలో తేలింది.
కరోనా పేషెంట్ తో కలిసి టాయ్లెట్ లోకి వెళ్లిన నర్సు.. లోపలికి వెళ్లగానే తన పీపీఈ కిట్లను తీసివేసిందట. ఆ తర్వాత ఒంటి మీద ఉన్న లోదుస్తులను కూడా తీసేసి ఆ పనికి పూనుకున్నామని నర్సుతో పాటు.. పేషెంట్ కూడా అంగీకరించారు. విచారణ లో ఇద్దరు తమ తప్పును అంగీకరించిన తర్వాత.. నర్సును ఆ క్వారంటైన్ కేంద్రం నుంచి సస్పెండ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
కాగా. ఇండోనేషియా చట్టాల ప్రకారం.. వారిద్దరు క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోక తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. నర్సు పదవి ఎంతో ఉన్నతమైనదని.. రోగికి సేవ చేయడమే ఉండే ఈ వృత్తిని పలువురు ఇలాంటి చర్యల ద్వారా భ్రష్టు పట్టిస్తున్నారని వాపోతున్నారు. ఒకవేళ నేరం నిరూపితమైతే ఆ నర్సుకు పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాగా.. ఇద్దరు సెక్స్ లో పాల్గొన్న తర్వాత వారిద్దరినీ పరీక్షించగా.. ఆ పేషెంట్ కు కరోనా పాజిటివ్ రాగా.. నర్సుకు నెగిటివ్ అని తేలడం గమనార్హం.
Published by:Srinivas Munigala
First published:December 30, 2020, 18:17 IST