Indonesia earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంతంటే....

ఇండోనేసియాలో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంతంటే.... (File)

అసలే ప్రపంచం కరోనాతో ఇబ్బంది పడుతుంటే... మధ్యమధ్య ఈ భూకంపాలు వచ్చి... ప్రజలకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి.

  • Share this:
    Indonesia earthquake: ప్రపంచంలో జపాన్‌లో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. కానీ కొన్నేళ్లుగా జపాన్‌లో పెద్దగా రావట్లేదు. ఇండొనేసియా మాత్రం దశాబ్దాలుగా భూకంపాల బారిన పడుతూనే ఉంది. తాజాగా... బాలీకి... ఆగ్నేయంగా... 800 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత... 6.6గా నమోదైంది. ఎప్పుడైనా సరే తీవ్రత 7 దాటితే... అది ప్రమాదకరమైన భూకంపం కింద లెక్క. తాజా భూకంపంతో జావా తీరం ఉలిక్కిపడింది. ఉదయం 9.54 (అక్కడి టైమ్ ప్రకారం) కి ఇది సంభవించింది. దీని వల్ల తీర ప్రాంత పట్టణమైన బాతంగ్ దెబ్బతిన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

    ప్రస్తుతం సునామీ భయాలేవీ లేవనీ... భూకంపం వల్ల ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం... భూమికి 528 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రజలు... తమ భవనాలు రెండు నిమిషాలపాటూ... కదిలిన అనుభవాన్ని పొందినట్లు తెలిపారు. ఐతే... ఏ భవనాలకూ తీవ్ర స్థాయిలో నష్టం జరగలేదు.


    మనకు డౌట్ రావచ్చు. అక్కడే ఎందుకు ఈ భూకంపాలు అని. మన భూమి చుట్టూ... రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఒకటుంది. ఈ రింగులోనే అగ్నిపర్వతాలన్నీ ఉన్నాయి. ఇండొనేసియా సరిగ్గా ఈ రింగులోనే ఉంది. ఇంకా చెప్పాలంటే.... ఇండోనేసియా కింద... భూరీ అగ్నిపర్వతం ఉంది. కానీ అది బద్ధలవ్వట్లేదు. కాకపోతే... దాని ఉద్ధృతి వల్ల అప్పుడప్పుడూ ఇలా భూకంపాలు వస్తున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: