Home /News /trending /

INDONESIA CAUGHT ON CAMERA WATER SLIDE SNAPS IN HALF THROWS PEOPLE 30 FEET DOWN PAH

Shocking: వాటర్ గేమ్ లో ఊహించని ప్రమాదం.. 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ సందర్శకులు..

కింద పడుతున్న సందర్శకులు

కింద పడుతున్న సందర్శకులు

Indonesia: వారంతా సమ్మర్ లో పార్క్ లో సరదాగా గడపటానికి వెళ్లారు. వాటర్ గేమ్స్ లో భాగంగా ప్లాస్టిక్ టన్నేల్ లో ఎక్కారు. కాసేపటి తర్వాత.. ఊహించని సంఘటన జరిగింది.

సాధారణంగా సమ్మర్ లో విపరీతంగా ఉక్కపోత ఉంటుంది. దీన్నుంచి సేద తీరడానికి చాలా మంది పార్కులు, స్విమ్మింగ్ లకు వెళ్తుంటారు. ఒక్కొసారి అనుకొని సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఇలాంటి సంఘటన ఇండోనేషియాలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఇండొనేషియాలో (Indonesia)  ఈ షాకింగ్ ఘటన జరిగింది. స్థానికంగా కెంజెరన్ పార్క్‌ ( Kenjeran Park) అనే పార్కు ఉంది. అక్కడ స్థానికులు సరదగా గడుపుదామని వెళ్లారు. వాటర్ గేమ్స్ ఆడటానికి అక్కడే ఉన్న ఎత్తైన టన్నెల్ మాదిరిగా ఉన్న ప్లాస్టిక్ పైపులో ఎక్కారు. అది మెలికలు తిరిగి ఉంటుంది. చుట్టు తిరుగుతూ వస్తు.. చివరకు అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ కు అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, అక్కడ ఒక్కసారిగా టన్నెల్ లో పరిమితికి మించి ఎక్కువ మంది ఎక్కారు.


ఈ క్రమంలో టన్నెల్ అధిక బరువుతో ఒక్కసారిగా తెగి కింద పడింది. దీంతో అక్కడే ఉన్న రాడ్ ల మీద.. ప్రజలు పడ్డారు. దాదాపు.. 30 అడుగుల ఎత్తునుంచి ప్రజలు ఒక్కసారిగా కిందపడ్డారు.వీరిలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారు రాడ్ ల మీదుగా పడటం వలన కొంత మంది ఎముకలు విరిగాయి. వెంటనే పార్కు సిబ్బంది పోలీసులకు, అంబులెన్స్ లకు సమాచారం అందించారు. ఈ ఘటన మే 7 న జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. దీనిపై స్థానిక మేయర్ ఎరికాహ్యాడి స్పందించారు. ప్రమాదంపై విచారణ చేపట్టామని అన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.



ఆస్ట్రేలియాకు (Australia)  చెందిన స్కాట్ రోస్కారెల్ (Scott Roscarel) అనే వ్యక్తి  సదరాగా చేపలు పట్టడానికి వెళ్లాడు.

స్థానికంగా ఉత్తర భూభాగంలోని కాహిల్స్ క్రాసింగ్ (Cahills Crossing)  ప్రాంతంలో ఉన్న చెరువులో స్నేహితులతో కలిసి సరదాగా చేపలను పట్టడానికి వెళ్లాడు. ఆ తర్వాత.. గాలం వేశాడు. కొంత సేపటికి అతనికి గాలం బరువుగా మారింది. వెంటనే దాన్ని బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని గాలానికి మీటర్ పొడవైన బార్రా జాతీ చేప (metre Barra fish) చిక్కుకుంది. ఇంకేం పంట పండిందని అతని మిత్రులు సంబరపడ్డారు. గాలాన్ని బయటకు లాగుతున్నారు. అప్పుడు ఊహించని సంఘటన జరిగింది.

అక్కడ ఒక మొసలి (Crocodile) ప్రత్యక్ష మైంది. చేపను వెంటడింది. అక్కడి వారంతా మొసలి, చేపను వెంబడించడం గమనిస్తున్నారు. స్కాట్ రోస్కారెల్..  బలంగా గాలం ఉన్న కర్రను ఒడ్డు వైపుకు తీసుకొచ్చాడు. మొసలి కూడా ఏమాత్రం తగ్గకుండా.. గాలాన్ని వెంబడిస్తు ఒడ్డుకు చేరుకుంది. చేపపై, ఒడ్డున ఉన్న వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు అతను వేగంగా చేపను లాక్కొని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. పాపం.. మొసలి కోపంగా అలాగే చూస్తు ఉండిపోయింది. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో (Shocking video) నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Indonesia, Viral Video

తదుపరి వార్తలు