కొన్ని రోజులుగా ఇండిగో, స్పైస్ జెట్ (Indigo flight) విమానాలలో అనేక సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు.. విమానాలు ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన ఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్ని సార్లు.. విమానం బయలు దేరిన కొద్ది సేపటికే.. వాటిలో సాంకేతిక లోపాలు, వాతావరణం అనుకూలించక పోవడం వంటి అనేక కారణాలతో విమానాలు తిరిగి కిందకు ల్యాండ్ అయ్యాయి. అప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఇప్పటికే అంతర్జాతీయ విమాన యాన సంస్థ వరుసగా జరుగుతున్న పరిణామాలపై సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో.. మరో విమానం సాంకేతిక లోపాలలో దాయాది దేశంలో ల్యాండ్ అయ్యింది.
పూర్తి వివరాలు.. షార్జా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని విమానం స్టార్ట్ అయిన కొద్ది సేపట్లోనే తెలిసింది. దీంతో పైలట్ వెంటనే ఇండిగోను.. పాకిస్థాన్‌కు మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. కరాచీలో విమానం ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. "షార్జా నుండి హైదరాబాద్‌కు నడుపుతున్న ఇండిగో ఫ్లైట్ 6E-1406 కరాచీకి మళ్లించబడింది.
పైలట్ సాంకేతిక లోపాన్ని గమనించాడు. వెంటనే ముందు జాగ్రత్తగా విమానంను కరాచీకి మళ్లించాడు. కాగా, ప్రయాణికులను హైదరాబాద్‌కు తరలించేందుకు అదనపు విమానాన్ని కరాచీకి పంపుతున్నట్లు ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు వారాల్లో కరాచీలో దిగిన రెండో భారతీయ విమానయాన సంస్థ ఇది.
ఈ నెల ప్రారంభంలో, ఢిల్లీ నుండి దుబాయ్‌కి వెళ్లే స్పైస్‌జెట్ విమానం పాకిస్థాన్ (Pakistan) నగరంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతో షెడ్యూల్ లేకుండా ఆగింది. అప్పుడు.. 138 మంది ప్రయాణికులు తరువాత భారతదేశం నుండి పంపిన ప్రత్యామ్నాయ విమానంలో దుబాయ్‌కి బయలుదేరారు. వరుసగా విమానాలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై విమానయాన సంస్థ అధికారులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా ఒక ఎమ్మెల్యేను స్థానికులు బురదతో స్నానం చేయించారు.
ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh) ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. స్థానికంగా పిప్పర్ డ్యూరా లోని మహా రాజ్ గంజ్ లోని ప్రజలు.. పంటలు చక్కగా పండటానికి, వర్షాలు బాగా కురవడానికి వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. ఈ క్రమంలో.. అక్కడి ప్రజలు.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జై మంగల్ కనోజియాకు బురదతో స్నానం చేయించారు. అక్కడి ప్రజలు.. తమ నియోజక వర్గం నేత.. బురదలో స్నానంచేస్తే.. ఇంద్రుడు సంతోషిస్తాడని వారు భావిస్తారు.
అందుకే.. అక్కడి ప్రజలు తమ నియోజక వర్గానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే జై మంగల్ కనోజియాపై బురద స్నానం చేయించారు. దీన్ని అక్కడి ప్రజలు.. కాల్ కలూటీ అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం కొందరు మహిళలు ఎమ్మెల్యేకు బురదతో స్నానం చేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (viral video) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.