ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఫ్యాషనబుల్ సన్ గ్లాసెస్ ఉపయోగించడం చాలామంది చేసే పనే. కానీ వర్షాకాలం వచ్చిదంటే వాటిని చాలా మంది పక్కన పడేస్తుంటారు. కానీ తమ సన్ గ్లాస్ కలెక్షన్స్‌ను అందరికీ చూపించేందుకు ‘సన్ గ్లాస్ ట్విట్టర్’ అనే ట్రెండ్‌ని ప్రారంభించారు కొందరు ట్విట్టర్ యూజర్లు. కళ్లద్దాలు ధరించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. తమ దగ్గర ఉన్న అందమైన సన్ గ్లాసెస్‌ని అందరికీ చూపుతున్నారు. కొందరు దీనికి ఫన్ యాంగిల్ జోడిస్తుంటే మరికొందరు మాత్రం సన్ గ్లాసెస్ పై తమకున్న ఇష్టాన్ని ప్రకటిస్తున్నారు. వివిధ షేప్స్‌లో ఉన్న సన్ గ్లాసెస్ ఉపయోగిస్తూ వివిధ యాంగిల్స్‌లో ఫొటోలు తీసుకుంటూ వాటిని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఎవరెవరు ఎలాంటి పోస్టులు చేస్తున్నారంటే..
సన్ గ్లాసెస్‌కు సంబంధించి ఎక్కువ మందికి తెలియని కొన్ని నమ్మలేని నిజాలను వెల్లడించింది సప్నా మదన్ అనే యూజర్. "ఈ గ్లాసెస్ కేవలం ఎండ నుంచి మనల్ని కాపాడేందుకు ఉపయోగపడతాయని చాలామంది భావిస్తారు. కానీ ఎదుటివాళ్లకు తెలియకుండా వారిని చూస్తూ ఉండేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మీకు నచ్చినవారిని రెప్పార్పకుండా చూడవచ్చు" అని వెల్లడించింది.
తనే కాదు.. మరో ట్విట్టర్ యూజర్ దివ్యేశ్ నీటిలో సన్ గ్లాసెస్ పెట్టుకొని ఉన్న ఓ అద్భుతమైన ఫొటోను జోడిస్తూ "నేను ఆలస్యమయ్యానేమో.. కానీ ఈ ట్రెండ్ లో ఇది నా ఎంట్రీ " అంటూ పోస్ట్ చేశారు. తాను సన్ గ్లాసెస్ పెట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ "ట్విట్టర్‌ను ఇన్ స్ట్రాగ్రామ్ యూజర్‌లా మార్చే ఈ ట్రెండ్స్ అంటే నాకు ఇష్టం. థ్యాంక్యూ సన్ గ్లాస్ ట్విట్టర్" అంటూ క్యాప్షన్ రాశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేషనల్ కన్వీనర్ హసీబా అమిన్.
మరో ట్విట్టర్ యూజర్ శ్రుతి తన కళ్లను సూర్య కిరణాల నుంచి కాపాడుకుంటూ తీసిన ఫొటోను షేర్ చేస్తూ "సన్ గ్లాస్ ట్విట్టర్.. ప్రతి విషయంలోనూ మంచి కోణాన్ని చూడాల్సిన అవసరం ఉంది" అంటూ పోస్ట్ చేసింది. మరో యూజర్ తమ కుటుంబంలోని అందరు వ్యక్తులు సన్ గ్లాసెస్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేసింది. అలవిలా కాపటేల్ అనే యువతి "సన్ గ్లాసెస్ అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే" అన్న క్యాప్షన్ తో తాను సన్ గ్లాసెస్ పెట్టుకున్న కొన్ని ఫొటోల కలెక్షన్ షేర్ చేసింది.
హరియాణ డెమొక్రటిక్ ఫ్రంట్ మెంబర్ చిత్ర సర్వార తన సన్ గ్లాసెస్ ఫొటోల కలెక్షన్ ని
షేర్ చేస్తూ "ఈ ఫొటోలతో నేను సన్ గ్లాస్ ట్విట్టర్ ట్రెండ్ కి ఎలిజిబుల్ అవుతానా?" అంటూ పోస్ట్ చేశారు. "సన్ గ్లాసెస్ లేకపోతే నేను పూర్తి కాను" అంటూ ఓ యూజర్.. ఇది నా ఎంట్రీ అంటూ మరికొందరు యూజర్స్ చాలామంది ఇలా పోస్ట్ చేస్తున్నారు.
గతేడాది శారీ ట్విట్టర్, ఆ తర్వాత లాక్ డౌన్ ఛెఫ్ వంటి ఎన్నో ట్రెండ్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యాయి. నెటిజన్లు తమ ఫొటోలను షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు సన్‌గ్లాస్ ట్విట్టర్ ట్రెండ్ ఎన్ని రోజులు కొనసాగుతుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending