Biryani | నిమిషానికి 95 బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నాం..

దేశవ్యాప్తంగా భారతీయులు ఒక్క నిమిషానికే 95 బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నారట. స్విగ్గీ నిర్వహించిన సర్వేలో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

news18-telugu
Updated: December 24, 2019, 6:22 PM IST
Biryani | నిమిషానికి 95 బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నాం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఆ మాట వినగానే నోట్లో నీరు ఊరుతుంది. పళ్లెం ఎప్పుడు వడ్డిస్తే.. ఎంత తొందరగా లాగించేస్తామా అని చూస్తాం. మరి రోజుకు ఎంతమంది బిర్యానీ తింటున్నారు? ఎంత వరకు బిర్యానీ అమ్ముడుపోతోంది? అని లెక్కలేస్తే.. ఊహించని షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా భారతీయులు ఒక్క నిమిషానికే 95 బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నారట. స్విగ్గీ నిర్వహించిన సర్వేలో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని ఆహార ప్రియులకు ఇష్టమైనవి కిచిడీ, బిర్యానీ, గులాబ్ జామూన్ అని సర్వేలో తేలింది. 2019లోనే అతి ఎక్కువగా, పెద్దమొత్తంలో ఆర్డర్ చేస్తున్నది బిర్యానీయే అని వెల్లడైంది.

అటు.. దేశంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీని పూణెకు చెందిన ఓ రెస్టారెంట్ రూ.1500కు విక్రయిస్తుండగా, ముంబైలో ‘ఛాల్ ధన్నో తవా బిర్యానీ’ని కేవలం రూ.19కి అందజేస్తున్నారట. ఆ తర్వాత గులాబ్ జామూన్‌ 17.7 లక్షల ఆర్డర్లు అందించినట్లు స్విగ్గీ తెలిపింది. అయితే.. ఇది కేవలం స్విగ్గీ చేసిన సర్వే మాత్రమే. జొమాటో, ఉబర్ ఈట్స్‌లో కూడా భారీగానే ఆర్డర్లు జరిగాయి. వాటినీ లెక్కలోకి తీసుకుంటే ఇంకా ఎక్కువగానే బిర్యానీలు అమ్ముడుపోతున్నట్లే.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 24, 2019, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading