కరోనా వైరస్ ప్రభావం.. ఆ కంపెనీ బీర్ల అమ్మకాలకు భారీ దెబ్బ..

కరోనా(Corona).. ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్ ఇది. ఈ పేరు వింటేనే అందరిలోనూ ఏదో తెలియని భయం. ఇండియాలో ఇప్పటి వరకు దీని కేసులు నమోదు కాకున్నా.. చైనా నుంచి ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

news18-telugu
Updated: January 28, 2020, 5:49 PM IST
కరోనా వైరస్ ప్రభావం.. ఆ కంపెనీ బీర్ల అమ్మకాలకు భారీ దెబ్బ..
కరోనా బీర్ వైరస్
  • Share this:
కరోనా(Corona).. ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్ ఇది. ఈ పేరు వింటేనే అందరిలోనూ ఏదో తెలియని భయం. ఇండియాలో ఇప్పటి వరకు దీని కేసులు నమోదు కాకున్నా.. చైనా నుంచి ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. చైనాలోని వుహాన్‌లో తొలి కేసు నమోదు కాగా, అక్కడి అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. ఈ వైరస్ సోకి ఇప్పటికే ఆ దేశంలో 106 మంది మృతి చెందారు. కరోనా సోకితే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ వైరస్ దెబ్బ ఓ బీర్ల కంపెనీకి భారీగానే పడుతోంది. కరోనా పేరిట బీర్ ఉంది. ఆ బీర్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న బీర్ల రేట్లకు డబుల్ ఉంటుంది. అయితే.. ఈ బీర్ తాగితే వైరస్ సోకుతోందా అని భయపడుతున్నారు ఇండియన్లు.

అందుకే గూగుల్‌లో పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. కరోనా బీర్ వైరస్(corona beer virus) పేరుతో గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఈ బీర్ తాగడం వల్ల వైరస్ సోకుతుందా? వ్యాధి లక్షణాలు ఏంటి? అని గూగుల్‌ను ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇండియన్లే కాకుండా.. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ప్రజలు కూడా కరోనా బీర్ వైరస్ అంటూ వెతుకుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమని, ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో.. ఇండియాకు వచ్చే చైనీయులు, చైనా నుంచి వస్తున్న ప్రయాణికులను ఎయిర్ ‌పోర్టుల్లోనే స్కాన్ చేసి దేశంలోకి అనుమతిస్తున్నారు అధికారులు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. ఇప్పటి వరకు ఇండియాలో ఈ వైరస్ సోకిన కేసులేవీ లేవు. అయితే.. ఈ వైరస్ ప్రభావంతో ఈ కంపెనీ బీర్ల అమ్మకాలపై ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు.

First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు