హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Delhi: డబ్లూఎఫ్‌ఐ అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు .. మహిళా రెజ్లర్లు ఏమంటున్నారో వినండి

Delhi: డబ్లూఎఫ్‌ఐ అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు .. మహిళా రెజ్లర్లు ఏమంటున్నారో వినండి

wrestlers dharna(Photo:Twitter)

wrestlers dharna(Photo:Twitter)

Delhi: భారత స్టార్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌ మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ)అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లర్లు ధర్నా చేపట్టారు. బ్రిజ్‌ భూషణ్‌తో పాటు రెజ్లింగ్‌ సమాఖ్యకు చెందిన మరికొందరు కోచ్‌లు కూడా తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఇండియన్ రెజ్లర్లు ధర్నాకు దిగారు. జంతర్,మంతర్ దగ్గర ఫేమస్ రెజ్లర్ వినేష్ ఫోగాట్‌(Vinesh Phogat)తో పాటు మరో 30మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్ శరణ్‌సింగ్‌ (Brij bhushan sharan singh)లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. రెజ్లింగ్‌ సమాఖ్యకు చెందిన కోచ్‌లతో పాటు మహిళా రెజ్లర్లను ఏళ్ల తరబడి లైంగికంగా వేధిస్తున్నాడని అతని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Viral News: కామెడీ వీడియోలతోనే కాసుల వర్షం..ఆడీ కారు కొన్న యూట్యూబర్‌.. అతని ఆస్తి, ఆదాయం ఎంతంటే..?

డబ్లూఎఫ్‌ఐ ప్రెసిడెంట్‌పై ఆరోపణలు..

భారత స్టార్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌ మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ)అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లర్లు ధర్నా చేపట్టారు. బ్రిజ్‌ భూషణ్‌తో పాటు రెజ్లింగ్‌ సమాఖ్యకు చెందిన మరికొందరు కోచ్‌లు కూడా తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ మండిపడుతున్నారు. జంతర్‌ మంతర్ దగ్గర నిర్వహించిన ఈ ఆందోళనలో ప్రముఖ రెజ్లర్ వినేశ్‌ ఫోగాట్ పాల్గొన్నారు.

' isDesktop="true" id="1586230" youtubeid="Fp5DNJ9CL40" category="national">

ఢిల్లీలో భారత రెజ్లర్ల ధర్నా..

లక్నోలో నిర్వహించిన జాతీయ శిక్షణ శిబిరంలో కొందరు మహిళలు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తరఫున మహిళా రెజ్లర్లను కలిశారని వినేశ్ ఫొగాట్ ఆరోపించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అవకతవకలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడికి సన్నిహితంగా ఉండే కొందరు అధికారుల నుంచి చంపేస్తామంటూ తనకు బెదిరింపులు కూడా వచ్చాయని ఆమె వెల్లడించారు. సుమారు 10 నుంచి 20 మంది మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని దృష్టికి తీసుకెళ్తామంటున్న రెజ్లర్లు..

చాలా ఏళ్లుగా ఈ లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతోందని మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌తో పాటు మరికొందరు కోచ్‌లు వేధింపులకు పాల్పడినట్లుగా వినేష్‌ ఫోగాట్ తెలిపారు. అయితే, తనకు ఎప్పుడూ లైంగిక వేధింపులు ఎదురుకాలేదన్నారామె. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఓ మహిళా రెజ్లర్‌కు అండగా నిలిచేందుకే ధర్నాలో పాల్గొన్నట్లుగా తెలిపారు. ఈవ్యవహారంలో స్వయంగా బాధితులే తనకు చెప్పారని ..పేర్లు బయటపెట్టడం సరికాదని వినేష్ ఫొగాట్. బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులు అరికట్టాలని చేపట్టిన ధర్నాలో వినేశ్‌ ఫొగాట్‌తో పాటు సంగీత ఫోగాట్,భజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్, సుమిత్‌ మాలిక్, సరితా మోరేతో పాటు 30మంది రెజ్లర్లు పాల్గొన్నారు.

Shiv Temple: ఈ ఆలయంలో జీన్స్, టీషర్ట్స్, స్కర్ట్స్ నిషేధం.. అప్పుడే శివయ్య దర్శనం

ఖండించిన ప్రెసిడెంట్..

మహిళా రెజ్లర్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయాన్ని ప్రధాని లేదా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తామంటున్నారు రెజ్లర్లు. అయితే రెజ్లర్ల ఆరోపణల్లో వాస్తవం లేదంటున్నారు డబ్లూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్. తాను అలాంటి తప్పు చేసినట్లుగా నిరూపిస్తే ప్రాణత్యాగం చేసుకుంటానని చెప్పారు.

First published:

Tags: Delhi news, VIRAL NEWS

ఉత్తమ కథలు