Home /News /trending /

INDIAN WOMEN DISCUSS DIVERSE TOPICS ON THE PLATFORM AND RANGING FROM CURRENT AFFAIRS TO SOCIAL CHANGE TWITTER SURVEY GH SSR

Twitter survey:ట్విట్టర్​లో మహిళలు ఎక్కువగా ఏం చర్చిస్తున్నారంటే.. సర్వేలో ఆసక్తికర విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​తో దాదాపు అన్ని రంగాలు మూతపడ్డాయి. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోమ్​ అమలు చేస్తున్నాయి. అంతేకాక, సుదీర్ఘకాలం పాటు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. తద్వారా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. కరోనా భయంతో బయట తిరగడానికి వీలు లేకపోవడంతో...

ఇంకా చదవండి ...
కరోనా వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​తో దాదాపు అన్ని రంగాలు మూతపడ్డాయి. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోమ్​ అమలు చేస్తున్నాయి. అంతేకాక, సుదీర్ఘకాలం పాటు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. తద్వారా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. కరోనా భయంతో బయట తిరగడానికి వీలు లేకపోవడంతో ప్రజలంతా సోషల్​ మీడియాపై అధిక సమయాన్ని వెచ్చించారు. లాక్​డౌన్​ సమయంలో అన్ని సోషల్​ మీడియా ప్లాట్​ఫాం​లతో పోలిస్తే ట్విట్టర్ ఘననీయమైన వృద్దిని సాధించింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ట్వీట్స్​ చేయడానికి ప్రాధాన్యతనిచ్చారు. తాజాగా ట్విట్టర్​ ఒక ఆసక్తికర సర్వే నిర్వహించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్విట్టర్​ మహిళలపై ఓ పరిశోధన చేసింది. 2019 ఫిబ్రవరి నుండి 2021 వరకు భారతీయ మహిళలు ట్విట్టర్​లో ఎక్కువగా ఏ విషయాలపై చర్చించారనే దానిపై సర్వే చేపట్టింది.

ఈ సర్వేలో 10 భారతీయ నగరాల నుంచి మొత్తం 700 మంది మహిళలు తమ చేసిన 5,22,992 ట్వీట్లపై సర్వే చేసింది. ఈ సర్వేలో ఫలితాల్లో సరికొత్త విషయాలు వెలుగులోకొచ్చాయి. మహిళలు ఎక్కువగా తొమ్మిది ముఖ్య అంశాలపై చర్చ జరిపినట్లు సర్వేలో తేలింది. ఇందులో అభిరుచులు, ఆసక్తులు టాప్​లో నిలిచాయి.  24.9% మహిళలు ట్విట్టర్​లో వారి ఆసక్తులు / అభిరుచుల గురించి మాట్లాడుకున్నారని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 39% మంది మహిళలు ట్విట్టర్ తమకు భావ ప్రకటనా స్వేచ్ఛను అందిస్తుందని పేర్కొన్నారు.

ఇక మహిళలు ఎక్కువగా ఫ్యాషన్​పై 30%, పుస్తకాలపై 28%,  అందంపై 25%, సినిమాలపై 21%, సంగీతంపై 18%, ఆహారంపై 18%,  టెక్నాలజీపై 17%,  కళలు, సాహిత్యంపై 17%,  క్రీడల గురించి 14% చర్చించారు. అంతేకాక, ప్రపంచంలో, దేశంలో జరుగుతున్న కరెంట్​ ఎఫైర్స్​పై 20.8% మంది మాట్లాడుకున్నారు. సెలబ్రేటరీ మూమెంట్స్​పై 14.5%, కమ్యూనిటీలపై 11.7%, సామాజిక మార్పు 8.7% మంది మహిళలు చర్చించారు. ట్విట్టర్ లో లైకులు, రిప్లైల విషయానికి వస్తే ఎక్కువగా రోజువారి ముచ్చట్లు, సెలబ్రెటీల మూమెంట్లపై ఎక్కువ చర్చ జరిగింది. #SheforShe, #TimesUp వంటి ఆన్‌లైన్ ఉద్యమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎక్కువ మంది మహిళలు ట్వీట్ చేసినట్లు నివేదిక పేర్కొంది.

10 నగరాల్లో 700 మందిపై సర్వే.. మహిళలు తమ కమ్యూనిటీకి సపోర్ట్ చేయడంలో ముందున్నారు. #MeToo వంటి అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొనడానికి వారు ట్విట్టర్​ను వినియోగించుకున్నారు. సర్వే ఫలితాలపై ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరి మాట్లాడుతూ ‘‘ట్విట్టర్లో మహిళల ఎటువంటి విషయాల గురించి చర్చిస్తున్నారనే విషయంపై ఈ సర్వే నిర్వహించాం. సర్వేలో చాలా ఆసక్తికర ఫలితాలొచ్చాయి. మహిళలు ఇంటర్నెట్‌ ద్వారా అడ్డంకులు లేకుండా,స్వేచ్ఛా​యుతంగా తమ ఆలోచనలను వ్యక్తీకరించడానికి ట్విట్టర్​ సరైన వేదికగా భావిస్తున్నారు. వారు స్వేచ్ఛగా సంభాషించడానికి, సంఘాలను ఏర్పర్చుకోవడానికి మా వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది.” అని అన్నారాయన. ట్విట్టర్​లో నేటి తరం మహిళలు మోడ్రన్ డేటింగ్, మానసిక ఆరోగ్యం గురించి ఎక్కువగా పంచుకున్నారు. #SareeTwitter నుండి #LockdownRecipes వరకు లాక్​డౌన్​ సమయంలో మహిళలు ఎక్కువగా ట్వీట్ చేయడానికి ఇష్టపడ్డారు. ట్విట్టర్​ ద్వారా వారి రోజువారీ అనుభవాలను పంచుకున్నారు.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Social Media, Survey, Twitter, Womens day 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు