హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మహా మృత్యుంజయ మంత్ర పఠనంతో రోగాలు తగ్గుతాయా..

మహా మృత్యుంజయ మంత్ర పఠనంతో రోగాలు తగ్గుతాయా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mahamrityunjaya Mantra: మహా మృత్యుంజయ మంత్రం ద్వారా రోగాలను నయం చేసే దిశగా శాస్త్రవేత్తలు అడుగు వేస్తున్నారు. ఈ పరీక్షలను ఢిల్లీలోని రామ్‌ మనోహర్ లోహియా(ఆఐఎల్) ఆస్పత్రిలోని ఐసీయూలో ఉన్న రోగులపై నిర్వహిస్తున్నారు.

‘‘ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్’’

మహా మృత్యుంజయ మంత్రం ఇది. పురాణాల ప్రకారం.. పాల సముద్రాన్ని చిలికే సమయంలో పుట్టిన విషాన్ని శివుడు దిగమింగి మృత్యుంజయుడు అవుతాడు. అలాగే, శివుడిలా మృత్యువును జయించేందుకు.. ఈ మంత్రం జపించి, చావు నుంచి తప్పించుకోవచ్చని కొందరి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని వారి భావన. ఆపదలు కలిగినపుడు పారాయణం చేస్తారు. అయితే, ఇప్పుడు ఈ మంత్రం ద్వారా రోగాలను నయం చేసే దిశగా శాస్త్రవేత్తలు అడుగు వేస్తున్నారు. ఈ పరీక్షలను ఢిల్లీలోని రామ్‌ మనోహర్ లోహియా(ఆఐఎల్) ఆస్పత్రిలోని ఐసీయూలో ఉన్న రోగులపై నిర్వహిస్తున్నారు. పరీక్షల కోసం మొత్తం 40 మంది రోగులను ఎంపిక చేశారు. వారంతా తలకు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారే. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరికి చికిత్స అందిస్తూనే మహా మృత్యుంజయ మంత్రం సంకల్పమిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఈ పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయించింది. సంస్కృత విద్యాపీఠ్ నుంచి వచ్చిన పండితులు సంకల్పమిచ్చి, తర్వాత వారిని విద్యాపీఠ్‌కు తీసుకువెళ్లి మంత్రాలను వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశోధనలు చివరి దశలో ఉన్నట్లు సమాచారం. మొత్తం 40 మంది రోగుల్లో 20 మందిని విద్యాపీఠ్ తీసుకువెళ్లి మంత్రాలను వినిపించారు.

2014లో డాక్టర్ అశోక్ కుమార్ ఈ మంత్రం గురించి తెలుసుకొని.. పరిశోధనలు చేయాలనుకున్నారు. వెంటనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు లేఖ రాశారు. దీంతో నెలకు రూ.28వేల ఇస్తూ పరిశోధనలకు అనుమతి ఇచ్చింది. ఈ పరీక్షలు ఎయిమ్స్‌లో నిర్వహించాలనుకున్నా, శాస్త్రీయం కాదని వైద్య బృందం తిరస్కరించింది. అయితే, రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలోని ఎథిక్స్ బృందం ఆయన అభ్యర్థనను పరిశీలించి, అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతానికి శాస్త్రబద్ధంగా రోగులకు ఈ ప్రక్రియను నిర్వహించారు. భారతీయ శాస్త్రాలలో మృత్యుంజయ మంత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే వైజ్ఞానికంగా ఈ మంత్ర ప్రభావం గురించి తెలుసుకునేందుకు పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో ఆశాజనక ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లు ఫలితం దక్కితే చరిత్రే అవుతుంది.

Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Devotional

ఉత్తమ కథలు