Star Explosions: అంతరించే దశలో ఉన్న 80 నక్షత్రాలను గుర్తించిన భారత శాస్త్రవేత్తలు

నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి? ఎలా అంతమవుతాయనే విషయం ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు మిస్టరీగా మారింది. తాజాగా మన గెలాక్సీలో 80 సరికొత్త నక్షత్ర విస్ఫోటనాలను (Explosions) కనుగొన్నారు భారత పరిశోధకులు. వీటిని సూపర్‌నోవా అవశేషాలు(Supernova remnants-SNR) అని పిలుస్తున్నారు.

నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి? ఎలా అంతమవుతాయనే విషయం ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు మిస్టరీగా మారింది. తాజాగా మన గెలాక్సీలో 80 సరికొత్త నక్షత్ర విస్ఫోటనాలను (Explosions) కనుగొన్నారు భారత పరిశోధకులు. వీటిని సూపర్‌నోవా అవశేషాలు(Supernova remnants-SNR) అని పిలుస్తున్నారు.

  • Share this:
అంతరిక్షంలో ఎన్నో నక్షత్ర సముదాయాలు ఉన్నాయి. కొన్ని నక్షత్ర సముదాయాలను పాలపుంత లేదా గెలాక్సి అని అంటారనే సంగతి తెలిసిందే. ఈ నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి? ఎలా అంతమవుతాయనే విషయం ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు మిస్టరీగా మారింది. తాజాగా మన గెలాక్సీలో 80 సరికొత్త నక్షత్ర విస్ఫోటనాలను (Explosions) కనుగొన్నారు భారత పరిశోధకులు. వీటిని సూపర్‌నోవా అవశేషాలు(Supernova remnants-SNR) అని పిలుస్తున్నారు. నక్షత్రం విస్ఫోటనం చెంది SNRగా ఏర్పడుతుందని.. షాక్ వేవ్, అంతరిక్ష నక్షత్రాల ద్వారా ప్రయాణించే ఉద్గార పదార్ధాలతో కూడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరించిపోయే దశలో ఉన్న నక్షత్రాలను సూపర్‌నోవా దశకు చేరాయని అంటారు.

గెలాక్సీలో మొత్తం 1000SNRలు..
ఇందులో భారీ వస్తువులు, వేగవంతమైన కాస్మిక్ రేస్ కూడా ఉన్నాయని బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇందుకోసం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్ అండ్ టెక్నాలజీని స్థాపించారు. గతంలో చేసిన పరిశోధనలు, సర్వేల ప్రకారం ఇప్పటి వరకు 270 సూపర్‌నోవా రెమినెంట్స్ ను కనుగొన్నారు. ఇంటర్ స్టెల్లార్ స్పేస్ రేడియా ఉద్గారాల ద్వారా వీటిని గుర్తించారు. అయితే గెలాక్సీలో 1000 ఎస్ఎన్ఆర్‌లు ఉన్నాయని అంచనా. అంటే కనీసం 700 ఎస్ఎన్ఆర్‌లను ఇంకా ఎవరూ గుర్తించలేదు.

ఐఐఎస్సీ ఫిజిక్స్ విభాగం సహా అధ్యాపకులు ప్రొఫెసర్ నిరుపమ్ రాయ్, ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ జగదీప్ డీ పాండియన్, ఎంఐపీఎఫ్ఆర్ లో పీహెచ్డీ చేస్తున్న రోహిత్ డోకారా ఈ పరిశోధనా బృందంలో ఉన్న భారతీయులు. ఎస్ఎన్ఆర్‌లపై చేసిన పరిశోధనలు జర్నల్‌లో ప్రచురితమైన మొదటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు రోహిత్ డోకారా. ‘గ్లో స్టార్’ ప్రాజెక్టు కింద వీరు పరిశోధనలో పాల్గొన్నారు. గ్లో స్టార్ ప్రాజెక్ట్.. గెలాక్సీలో SNRలను గుర్తించడానికి రెండు శక్తివంతమైన రెడియో టెలిస్కోపులను ఉపయోగించింది. యూఎస్‌ నేషనల్ రేడియో ఆస్ట్రానమి అబ్జర్వేటరీ(NRAO)లోని కార్ల్ జీ జాన్ స్కీ వెరీ లార్జ్ అర్రే(VLA) టెలిస్కోప్, ఎఫెల్స్ బర్గ్ 100 మీ రేడియో టెలిస్కోప్‌ను ఇందుకు వినియోగించారు.

అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు..
"గ్లోస్టార్ సర్వే విస్తృతమైన రేడియో ఉద్గారాలను గుర్తించింది. మిథనాల్ అణువు నుంచి అయోడైజ్డ్ హైడ్రోజన్ వరకు నక్షత్రాల ఆరంభ, అంతం దశల నిర్మాణం గురించి శోధించింది. గెలాక్సీలో నక్షత్రాల ఆవిర్భావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యం" అని పాండియన్ తెలిపారు. కొత్తగా కనుగొన్న 80 ఎస్ఎన్ఆర్‌లను వీఎల్ఏ డేటా ద్వారా కనుగొన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎఫెల్స్ బర్గ్ రేడియో టెలిస్కోప్.. పెద్ద సంఖ్యలో నక్షత్రాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీఎల్ఏ చిన్న యాంటినాలతో హై రిజల్యూషన్ ను కలిగి ఉంటుందని తెలిపారు. గెలాక్సీలో ఆస్ట్రోఫిజికల్ వస్తువులను గుర్తించేందుకు ఈ రెండు టెలిస్కోపులను పరిశోధకులు వినియోగిస్తున్నారు. మిస్సింగ్ సూపర్‌నోవా రెమినెంట్స్ ను కనుగొనడంలో ఈ పరిశోధనతో మరో ముందడుగు వేసినట్లు ప్రాజెక్టు లీడర్ ఆండ్రియాస్ బ్రంథేలర్ తెలిపారు.

ఇది క్లిక్ చేసి చూడండి.

ఇది క్లిక్ చేసి చూడండి.
Published by:Krishna Adithya
First published: