కాలుష్యం కనికరం లేకుండా కాటేస్తున్న రోజులివి. అందుకే చాలామంది ఇళ్లలో టీవీల మాదిరిగానే ఎయిర్ ప్యూరిఫయర్‌లు (Air Purifier) వినియోగిస్తున్నారు. దేశం మొత్తం ఇలా ఉందని చెప్పలేం కానీ.. ప్రధాన నగరాల పరిస్థితి ఇలానే ఉంది. దీంతో మార్కెట్‌లో కొత్త కొత్త రకాల ఎయిర్ ప్యూరిఫయర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో రోపార్ అండ్ కాన్పూర్‌కి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, డిల్లీ విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్ స్టడీస్ శాస్త్రవేత్తలు(Scientist) కలసి వైవిధ్యమైన ఎయిర్ ప్యూరిఫయర్‌ను రూపొందిచారు. దీని ప్రత్యేకత ఏంటంటే... ఇందులో ప్యూరిఫయర్‌తో పాటు మొక్క కూడా ఉంటుంది. ఈ మొక్క ఆధారిత ప్యూరిఫయర్‌ను ‘యూబ్రీథ్ లైఫ్’ అని పిలుస్తున్నారు. ఐఐటీ రోపార్‌కు (IIT Ropar) చెందిన స్టార్టప్ కంపెనీ అర్బన్ ఎయిర్ లేబొరేటరీ దీన్ని రూపొందించింది.
అంతేకాదు ప్రపంచంలోనే ఇది తొలి స్మార్ట్ బయో ఫిల్టర్ అని చెబుతున్నారు. ఐఐటీ రోపార్‌కు చెందిన ఐ హబ్- ఏడబ్ల్యూఏడీహెచ్ (అగ్రికల్చర్ అండ్ వాటర్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ హబ్)లో దీన్ని రూపొందించారు.
ఇండోర్‌లో ఈ ప్యూరిఫయర్లను వాడటం వల్ల ఎయిర్ ప్యూరిఫికేషన్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంటే వీటిని ఆసుపత్రులు, స్కూళ్లు, ఆఫీసులు, ఇళ్లలో వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు (Scientist) తెలిపారు. ఈ ఎయిర్ ప్యూరిఫయర్ మొక్క ఆధారంగా పని చేస్తుందట. అంటే ఏదైనా గదిలో ఈ యంత్రాన్ని పెట్టినప్పుడు... మొక్క ఆకులు గాలితో ఇంటరాక్ట్ అవుతాయి.
Airlines: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే విమాన టికెట్.. ఎలా పొందాలంటే..
ఆ తర్వాత మట్టిలోకి వెళ్లి కాలుష్య కారకాలను గాలి నుంచి తొలగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధానాన్ని అర్బన్ మున్నార్ ఎఫెక్ట్ (Munnar Effect) అంటారు. అంటే మొక్కల ఆకులు గాలిని పీల్చుకోవడం ద్వారా పైథోరెమిడేషన్ చర్య జరిగి గాలి శుభ్రపడుతుంది. దీని వల్ల గాలిలోని వాయువులు, పార్టిక్యులేట్స్, బయోలాజికల్ కంటైన్మెంట్లను తగ్గించి, ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందట.
Organ Donation: అవయవదానంలో కూడా వీడని స్నేహం.. చనిపోయి కూడా 13 మందిని బతికించారు.. ఎక్కడంటే..
దీంతోపాటు ప్యూరిఫయర్‌కు ఉపయోగిస్తున్న బాక్సులో యూవీ డిస్‌ఇన్‌ఫెక్షన్, ప్రీ ఫిల్టర్, ఛార్‌కోల్ ఫిల్టర్, హెపా ఉంటాయి. వాటి వల్ల గాలి మరింతగా శుభ్రపడుతుందట. ఫిల్టర్ చెక్క బాక్స్ మధ్యలో ఫ్యాన్ ఉంటుందట. ఇది గదిలోని గాలిని సక్షన్ ద్వారా పీలుస్తుంది.
Income Source: ప్రతీ నెల రూ.200 పొదుపుతో.. రూ.28 లక్షల వరకు పొందొచ్చు.. వివరాలిలా..
ఆ తర్వాత పైన ఉన్న మొక్క ద్వారా శుభ్రం చేసి బయటకు విడిచిపెడుతుంది. అయితే దీని కోసం ప్రత్యేకంగా పీస్ లిలీ, స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్‌ను వాడాలట. అవైతే ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నేషన్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లేబొరేటరీ, ఐఐటీ రాపోర్ లేబొరేటరీలో జరిగిన పరీక్షల్లో ఈ ప్యూరిఫయర్ల వల్ల గాలి నాణ్యత బాగా పెరిగిందని తేలిందట. 150 స్క్వేర్ ఫీట్ల గదిలో ఈ ప్యూరిఫయర్‌ను పెడితే... 15 నిమిషాల్లో గాలిలో కాలుష్యం శాతం 311 నుంచి 39కి చేరిందట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central governmennt, Trending, Trending news