Indian Railways: ప్రయాణికులకు పండగే.. ఇక రైళ్లలో ఉచితంగా సినిమాలు, వీడియోలు..

Indian Railways News | రైల్లో వెళ్తున్నపుడు, రైల్వే స్టేషన్‌లో వేచిచూస్తున్నపుడు బోర్ కొట్టకుండా సినిమాలు, వీడియోలు చూసే వీలు కల్పిస్తోంది. అది కూడా ఉచితంగానే.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 2, 2019, 6:00 PM IST
Indian Railways: ప్రయాణికులకు పండగే.. ఇక రైళ్లలో ఉచితంగా సినిమాలు, వీడియోలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ మస్త్ టైంపాస్ అందించబోతోంది. రైల్లో వెళ్తున్నపుడు, రైల్వే స్టేషన్‌లో వేచిచూస్తున్నపుడు బోర్ కొట్టకుండా సినిమాలు, వీడియోలు చూసే వీలు కల్పిస్తోంది. అది కూడా ఉచితంగానే. దీనికోసం రైల్‌టెల్ టెలికం కంపెనీతో పీయుష్ గోయల్ నేతృత్వంలోని రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ప్రపోజల్‌ను త్వరలోనే ఆ కంపెనీ ప్రకటించనుంది. రైల్‌టెల్ కంపెనీ ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఆ యాప్‌ను ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకొని, దాని ద్వారా వార్తలు, సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాలను ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు. ‘రైల్‌టెల్ అందుబాటులోకి తెచ్చే యాప్‌లో ప్రీలోడెడ్ బహుబాషా వీడియోలు, మ్యూజిక్, ఇతర వినోద కార్యక్రమాలు, టీవీ సీరియల్స్, భక్తి కార్యక్రమాలు, లైఫ్‌స్టైల్ సంబంధిత వీడియోలు ఉంటాయి. రైలు కదులుతున్నపుడు కూడా ఈ వీడియోలు ఎలాంటి ఆటంకం లేకుండా వీక్షించవచ్చు.’ అని ఓ రైల్వే అధికారి తెలిపారు.

ఇంతకుముందు తేజస్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది రైళ్లలోని అనుభూతి కోచ్‌లలో విమానాల్లో మాదిరి స్క్రీన్లు, హెడ్‌ఫోన్స్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు వినోదాన్ని అందించింది రైల్వే శాఖ. అయితే, ఆ రైళ్ల తొలి ప్రయాణంలోనే స్క్రీన్లను పగలగొట్టడం, హెడ్‌ఫోన్లను ఎత్తుకెళ్లడం లాంటి ఘటనలు జరగడంతో వాటిని విరమించుకుంది. దానికి బదులుగా తాజాగా నిర్ణయించిన విధంగా వినోదాన్ని అందించాలని నిర్ణయించింది. వీడియోలకు ముందు కనిపించే అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా ఆదాయం ఆర్జించవచ్చని, అటు ప్రయాణికులకు వినోదం అందించవచ్చని రైల్వే శాఖ యోచించింది.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు