• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • INDIAN RAILWAYS INTRODUCES BIOMETRIC SYSTEM FOR UNRESERVED COACHES IN TWO STATIONS NK

Indian Railways : రిజర్వ్ కాని కోచుల్లో సీట్లు కావాలా... కొత్త విధానం తెచ్చిన రైల్వే

Indian Railways : రిజర్వ్ కాని కోచుల్లో సీట్లు కావాలా... కొత్త విధానం తెచ్చిన రైల్వే

సాధారణ రోజుల్లో వర్తించే రిజర్వేషన్ ఛార్జీల కంటే ఇలా కరెంట్ రిజర్వేషన్ ద్వారా బుక్ చేసుకునే బెర్త్‌లకు ఛార్జీలు తక్కువ.

Indian Railways Reservation : సాధారణ ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా... ఇండియన్ రైల్వేస్... బయోమెట్రిక్ విధానం తెచ్చింది. దీని ద్వారా ప్రయాణికులు... రిజర్వ్ కాని కోచ్‌లలో బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా కచ్చితంగా సీట్లు పొందే వీలుంది.

  • Share this:
Indian Railways introduces biometric system for unreserved coaches : జనరల్ క్లాస్‌లో ప్రయాణమంటే నరకమే. సీట్లు దొరకడం చాలా కష్టం. అలాంటి అన్ రిజర్వ్‌డ్ కోచ్‌లలో కూడా సీట్లు పొందవచ్చంటున్నారు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్. ప్రస్తుతానికి దీన్ని పైలట్ ప్రాజెక్టుగా... పశ్చిమ రైల్వే డివిజన్‌కి చెందిన ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్, బాంద్రా టెర్మినస్‌లో ప్రారంభించారు. దీని ముఖ్యఉద్దేశం ఏంటంటే... రైలు రాగానే... తొక్కిసలాట లాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రౌడీలూ, సంఘ విద్రోహశక్తులు, ఆకతాయిలూ ఎక్కువగా సీట్లను ఆక్రమిస్తున్నారు. దీని వల్ల ఇతర సాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకట్లేదు. అందుకే రైల్వే ఈ నిర్ణయం తీసుకుందని పియూష్ గోయల్ తెలిపారు.

ఈ కొత్త బయోమెట్రిక్ సిస్టం రిజర్వ్ కాని కోచ్‌లకు ఎలా పనిచేస్తుంది : ఇకపై జనరల్ క్లాస్ కోచ్‌లకు టికెట్లు కొనుక్కునే ప్రయాణికులు... బయోమెట్రిక్ యంత్రం దగ్గర తమ వేలి ముద్రలను స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఓ టోకెన్ ఇస్తారు. కోచ్‌లో ఎన్ని సీట్లు ఉంటాయో... అన్ని టోకెన్లను ఆర్డర్‌లో ఇస్తారు. ఫలితంగా ట్రైన్ వచ్చే టప్పుడు... ప్రయాణికులు... తన టోకెన్ నంబర్ ఆధారంగా... లైన్‌లో (క్యూలో) నిల్చోవాల్సి ఉంటుంది. అంటే ఒకటి నుంచీ 10 వరకూ నంబర్ ఉన్నవారు ముందు.... ఆ తర్వాతి నంబర్ల వారు వాళ్ల వెనక నిల్చోవాల్సి ఉంటుంది. రైల్వే రిజర్వ్ దళాల పోలీసులు ప్రయాణికులను... టోకెన్ నంబర్ ఆధారంగా వారి వారి సీట్లలో కూర్చునేలా చేస్తారు. దీని వల్ల సీట్లను ఆక్రమించుకొని... వేరే వాళ్లకు అమ్ముకొనే దళారీ వ్యవస్థకు చెక్ పెట్టినట్లవుతుంది. అలాగే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి... దొంగలెవరైనా ట్రైన్ ఎక్కితే... ఈజీగా పట్టుకోవచ్చు. ప్రారంభంలో రెండు స్టేషన్లకూ కలిపి 4 బయోమెట్రిక్ యంత్రాల్ని సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు.
First published: