INDIAN RAILWAYS HAS COMPLETED THE TRIALS OF NEW ECONOMY AC 3 TIER COACH AT A SPEED OF 180 KILOMETERS PER HOUR VIDEO NS
Indian Railways: ఇండియన్ రైల్వే మరో రికార్డు.. గంటకు 180 కి.మీ వేగంతో ఎకానమీ ఏసీ 3-టైర్ కోచ్ ట్రయల్స్.. వీడియో
ప్రతీకాత్మక చిత్రం
ఇండియన్ రైల్వే మరో రికార్డు సృష్టించింది. నూతనంగా రూపొందిస్తున్న ఎకానమీ ఏసీ 3-టైర్ కోచ్ లను గంటకు 180 కిలో మీటర్ వేగంతో ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించింది.
ఇండియన్ రైల్వే మరో రికార్డు సృష్టించింది. నూతనంగా రూపొందిస్తున్న ఎకానమీ ఏసీ 3-టైర్ కోచ్ లను గంటకు 180 కిలో మీటర్ వేగంతో ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించింది. కపుర్థలలోని రైల్వే కోచ్ ఫాక్టరీలో వీటిని రూపొందించారు. వీటికి కొన్ని రోజులుగా ఆర్డీఎస్ఓ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఎకానమీ ఏసీ 3 టైర్ కోచ్ లను 180 కిలో మీటర్ల వేగం వద్ద నిర్వహించిన ట్రయల్స్ కు సంబంధించిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ తాజాగా షేర్ చేసింది. ఈ ట్రైల్స్ విజయవంతమై అనుమతులు లభిస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ కోచ్ లను అధిక మొత్తంలో తయరీని చేపట్టనుంది. పూర్తిగా లోడ్ చేసే ఈ ట్రయల్స్ ను నిర్వహించినట్లు ఇండియన్ రైల్వే అధికారులు తెలిపారు.
నూతన కోచ్ రూపకల్పనపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ‘కోచ్ రూపకల్పనలో అనేక నూతన ఆవిష్కరణలు చేర్చబడ్డాయి. ఆన్‌బోర్డులో ఏర్పాటు చేసిన హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ స్విచ్ గేర్ అండర్ ఫ్రేమ్‌కు దిగువకు మార్చబడింది. అంతేకాక, అదనంగా 11 బెర్తులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణీకుల సామర్థ్యం మరింతగా పెరుగుతుంది.” అని పేర్కొంది. అంతేకాక, ప్రతి కోచ్‌లో వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఒక స్నేహపూర్వక టాయిలెట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపర్చడానికి డిజైన్‌లో అనేక మార్పులను కూడా చేసింది.
Oscillation Trial :
New AC 3-Tier coaches with modern facilities have been built.
These coaches have been designed in an innovative way having capacity of 83 berths.
Trial was conducted at 180 kmph in Kota - Sawai Madhopur section in loaded condition. pic.twitter.com/SVWGjLeJj7
రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం.. ప్రతి కోచ్‌లో మోడరన్ డిజైన్‌తో రూపొందించిన సీట్లు, బెర్తులను చేర్చింది. ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్, వాటర్ బాటిల్స్, మొబైల్ ఫోన్, మ్యాగజైన్ల కోసం ప్రత్యేక హోల్డర్లను అందించింది. స్టాండర్డ్ సాకెట్‌తో పాటు ప్రతి బెర్త్‌కు వ్యక్తిగత రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను పొందుపర్చింది. మధ్య, ఎగువ బెర్తులను యాక్సెస్ చేయడానికి నిచ్చెనలో ఎర్గోనామిక్‌గా మెరుగైన డిజైన్‌ను కూడా అందించింది. అంతేకాక, మధ్య, ఎగువ బెర్తులలో హెడ్‌రూమ్‌ను పెంచింది.