Home /News /trending /

INDIAN RAILWAYS EMPLOYEE PRINTING TICKETS MORE SPEED THAN ROBOTS STUNS PEOPLE PVN

Viral Video : రోబో కంటే స్పీడ్..ఈ రైల్వే ఉద్యోగి టిక్కెట్లు ఇవ్వడం చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు

రోబో కంటే స్పీడ్ గా రైల్వే టిక్కెట్లు

రోబో కంటే స్పీడ్ గా రైల్వే టిక్కెట్లు

Printing tickets more speed : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు చాలా క్రేజ్ ఉంది. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం దొరికితే జీవితం సెట్ అవుతుందని భారతీయ కుటుంబాలు నమ్ముతాయి. ఇందుకు కారణం ఈ ఉద్యోగాల్లో ఉన్న సౌకర్యాలతోపాటు సౌకర్యాలే.

Railway employee printing tickets more speed : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు(Goverment Jobs) చాలా క్రేజ్ ఉంది. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం దొరికితే జీవితం సెట్ అవుతుందని భారతీయ కుటుంబాలు నమ్ముతాయి. ఇందుకు కారణం ఈ ఉద్యోగాల్లో ఉన్న సౌకర్యాలతోపాటు సౌకర్యాలే. ప్రభుత్వ ఉద్యోగం పొందితే కష్టపడాల్సిన అవసరం లేదని సాధారణంగా నమ్ముతారు. ప్రతినెలా సులభంగా జీతం చేతికి వస్తుంది. ప్రభుత్వోద్యోగులు బద్దకస్తులు అవుతారనేది కూడా చాలా మంది భావనగా మారింది. అయితే ఈ విషయాన్ని పటాపంచలు చేసే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా లోకక్ టిక్కెట్ల కోసం కైల్వే స్టేషన్‌లో పెద్ద పెద్ద క్యూలు ఉంటాయి. దీంతో అప్పుడప్పుడు రైలు వచ్చే సమయానికి టిక్కెట్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. కొన్నిసార్లు టిక్కెట్ తీసుకోవడం కుదరక టిక్కెట్ లేకుండానే రైలు ప్రయాణాలు చేస్తుంటారు మనదేశంలో. ఇలాంటివి భారతీయ రైల్వే(Indian Railway)లో సర్వసాధారణం. అయితే ఓ రైల్వే ఉద్యోగి ప్రయాణికులకు టక్కెట్లు ఇస్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టిక్కెట్లు ఇవ్వండంలో పెద్ద విషయమేముంది అనుకుంటున్నారా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండోయ్.

Viral Flex : నన్ను నేను అభినందిస్తున్నా..10 పాస్ అయిన ఆనందంలో ఊర్లో ప్లెక్సీలు

వైరల్ అవుతున్న వీడియోలో..ఓ రైల్వే ఉద్యోగి ఆటోమేటిక్‌ వెండింగ్‌ మెషీన్‌లో టికెట్లు ఇస్తూ కనిపించాడు. అతను కేవలం పదిహేను సెకన్లలో మూడు టిక్కెట్లను ప్రయాణికులకు అందించాడు. గమ్యస్థానాన్ని మాత్రమే అడుగుతూ ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకుని వాళ్లకి టిక్కెట్‌ ఇవ్వడం చూడొచ్చు. ఒక టికెట్ ఇవ్వడానికి ముందు అతను ఇతర ప్రయాణీకుడి నుండి అతని సమాచారాన్ని తీసుకున్న తర్వాత రెండవ టిక్కెట్ కోసం సిద్దం చేస్తూ కనిపించాడు. కేవలం 15 సెకన్ల వ్యవధిలో మూడు టిక్కెట్లను కట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.



ఇతను రోబో కంటే స్పీడ్ గా టిక్కెట్లను ఇస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.మరికొందరు స్లో మోషన్ వర్క్ కల్చర్‌కు పేరుగాంచిన భారతీయ రైల్వేలో ఇలాంటి సూపర్‌ఫాస్ట్ ఉద్యోగిని చూస్తే ఎవరూ తమ కళ్లను నమ్మలేరని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.టిక్కెట్ల కోసం హడావుడి చేసే వారికి ఈ వ్యక్తి దూ దేవుడు లాంటివాడు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Indian Railway, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు