Home /News /trending /

INDIAN RAILWAYS ANNOUNCED SPECIAL TRAINS SABARIMALA AYYAPPA DEVOTEES FROM SECUNDERABAD NIZAMABAD KAKINADA AND VISAKHAPATNAM KNOW SPECIAL TRAIN TIMINGS DATES AND OTHER DETAILS SS

Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్... భారతీయ రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్ల వివరాలివే

Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్... భారతీయ రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్ల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్... భారతీయ రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్ల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Special Trains to Sabarimala | శబరిమల భక్తుల కోసం భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్, నిజామాబాద్, కాకినాడ, విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

    శబరిమల వెళ్లాలనుకునే అయ్యప్ప భక్తులకు శుభవార్త. భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే డిసెంబర్ 6 నుంచి జనవరి 18 వరకు 12 స్పెషల్ ట్రైన్స్‌ను శబరిమలకు నడపనుంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచే ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ మొదలైంది. డిసెంబర్ 11, 15, 19 తేదీల్లో హైదరాబాద్ నుంచి, డిసెంబర్ 6, 13, 22 తేదీల్లో నిజామాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3:55 గంటలకు హైదరాబాద్‌లో రైలు బయల్దేరుతుంది. కొల్లాంకు మరుసటి రోజు రాత్రి 11:55 గంటలకు రైలు చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 8, 15, 21, 24 తేదీల్లో మధ్యాహ్నం 3:00 గంటలకు కొల్లాంలో రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు 10:45 గంటలకు రైలు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఇక నిజామాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు మధ్యాహ్నం 12:10 గంటలకు బయల్దేరుతుంది. మరుసటిరోజు రాత్రి 11:55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. డిసెంబర్ 13,17 తేదీల్లో కొల్లాం నుంచి నిజామాబాద్‌కు ప్రత్యేక రైలు నడుస్తుంది. కాకినాడ నుంచి కొల్లాంకు ప్రత్యేక రైలు కూడా నడవనుంది.

    సికింద్రాబాద్-కొల్లాం ప్రత్యేక రైలు జనగాం, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్, ఈరోడ్, కొయంబత్తూర్, ఒట్టపాలెం, ఎర్నాకులం, కొట్టాయం, చెంగనూర్ స్టేషన్లలో ఆగుతుంది. నిజామాబాద్-కొల్లాం స్పెషల్ ట్రైన్ కామారెడ్డి, మల్కాజ్‌గిరి, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు, గుత్తి, తాడిపత్రి, కడప, రేణిగుంట, కాట్పాడి, ఈరోడ్, కొయంబత్తూర్, కొట్టాయం, చెంగనూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఇక కాకినాడ-కొల్లాం స్పెషల్ ట్రైన్ సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుండ, తిరుత్తణి, సేలం, తిరుపూర్, పాలక్కాడ్, అలువా, కొట్టాయం, తిరువళ్ల స్టేషన్లలో ఆగుతుంది.

    మరోవైపు విశాఖపట్నం నుంచి కొల్లాంకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక రైలు 2019 నవంబర్ 17 నుంచి 2020 జనవరి 21 మధ్య 10 ట్రిప్స్ తిరుగుతుంది. విశాఖపట్నం నుంచి కొల్లాంకు నవంబర్ 17, 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో రైలు నడుస్తుంది. ప్రతీ ఆదివారం రాత్రి 11.50 నిమిషాలకు విశాఖపట్నంలో బయల్దేరితే మంగళవారం ఉదయం 6.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. కొల్లాం నుంచి విశాఖపట్నానికి నవంబర్ 19, 26, డిసెంబర్ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో ప్రత్యేక రైలు నడుస్తుంది. ప్రతీ మంగళవారం ఉదయం 10.00 గంటలకు కొల్లాంలో బయల్దేరితే బయల్దేరితే విశాఖపట్నానికి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుండ, తిరుత్తణి, కాట్పాడి, వనియంబడి, జోల్లార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్ జంక్షన్, పాల్ఘట్, ఒట్టపాలం, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనసేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెల్కారా, కన్యాకులం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

    Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    IRCTC: శ్రీరామ భక్తులకు శుభవార్త... ఐఆర్‌సీటీసీ నుంచి అద్భుతమైన టూర్ ప్యాకేజీ

    Sabarimala: శబరిమల యాత్రికులకు శుభవార్త... ఆన్‌లైన్ బుకింగ్ చేయండి ఇలా

    Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రూ.20,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే...
    First published:

    Tags: Indian Railway, Indian Railways, Railways, Sabarimala Temple, South Central Railways, Visakha Railway Zone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు