INDIAN ORIGIN GIRLS DANCE BARSO RE MEGHA AISHWARYA RAI SONG AT TIMES SQUARE NEWYORK VIRAL PVN
Viral Video : అర్థరాత్రి నడిరోడ్డులో అమ్మాయిల డ్యాన్స్..ఇరగదీశారు చూడండి
రోడ్డుపై అమ్మాయిల డ్యాన్స్
Indian origin girls dance : నలుగురి డ్యాన్స్ చూస్తుంటే.. రోడ్డు మీద ఈ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చాలా కాలంగా ప్రిపేర్ అయ్యారేమో అనిపిస్తుంది. నెటిజన్లు ఈ వీడియోను బాగా లైక్ చేస్తున్నారు. వీళ్ల డ్యాన్స్ అద్భుతం,అబ్బా ఎంత బాగుందో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
భారతీయులు(Indians) ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా భారతీయ సినిమాపై వారి ప్రేమ ఎప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుంది. విదేశాల్లో భారతీయ సినిమాను ప్రమోట్ చేస్తున్న వ్యక్తులు కనిపించే వీడియోలను మీరు సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్(Viral) అవుతోంది. ఇందులో అమెరికా వీధుల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ పాటలకు భారతీయ సంతతి అమ్మాయిలు అద్భుతమైన నృత్యం(Dance) చేస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్ యూజర్ @eshhpat.. డాన్సర్‌తో పాటు డెంటిస్ట్ కూడా. ఆమె దేశీ షఫుల్ అనే డ్యాన్స్ గ్రూప్‌లో కూడా సభ్యురాలు. ఇటీవల ఆమె అమెరికాలోని న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్(Times Square) వద్ద మరో ముగ్గురు యువతులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఐశ్వర్యరాయ్(Aishwarya rai) పాట బార్సో రే మేఘకి వీళ్లు నలుగురు డాన్స్ చేస్తున్నారు. అర్థరాత్రి టైమ్ స్క్వేర్ వద్ద వర్షం పడుతున్నప్పుడు అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేశారు.
వీళ్ల డ్యాన్స్ మరియు స్టైల్ అద్భుతంగా కనిపించింది. నలుగురి డ్యాన్స్ చూస్తుంటే.. రోడ్డు మీద ఈ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చాలా కాలంగా ప్రిపేర్ అయ్యారేమో అనిపిస్తుంది. నెటిజన్లు ఈ వీడియోను బాగా లైక్ చేస్తున్నారు. వీళ్ల డ్యాన్స్ అద్భుతం,అబ్బా ఎంత బాగుందో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు,చాలామంది రైల్వే హెచ్చరికలను పట్టించుకోక ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్(Viral Video) అవుతోంది. ఓ యువతి అజాగ్రత్త కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. వైరల్ వీడియోలో ఓ యువతి..కదులుతున్న రైలులోని డోర్ అంచున నిలబడి ఉంది. మొదట తన దుస్తులు సరిచేసుకుంటూ కనిపించిన ఆ యువతి...తర్వాత తన జుట్టును సరిచేసుకుంటూ, రైలు నుండి సగం శరీరాన్ని బయటకు పెట్టి గాలి పీల్చుకోవాలని అనుకుంది. అయితే ఇదే ఆమెకు సమస్యగా మారింది. అయితే అదే ట్రాక్‌పై నుంచి రైలు వస్తన్న విషయాన్ని యువతి తెలియదు. దీంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి రైలు కింద పడింది. వెంటనే యువతి వెనుక నిలబడిన ప్రయాణికులే ఆమెకు దూతలా మారారు. ఈ ప్రయాణికులు సకాలంలో యువతి చేయి పట్టుకున్నారు. చాలా సేపటికి ఆ యువతి రైలుకు వేలాడుతూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులు బాలిక చేయి గట్టిగా పట్టుకున్నారు. అనంతరం బాలికను పైకి లాగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.