వర్జిన్ వధువే కావాలట.. గూగుల్ సెర్చ్‌లో నమ్మలేని నిజాలు..

ప్రతీకాత్మక చిత్రం

మన దేశంలో పెళ్లి కుమారులు ‘వర్జినిటీ’కే అగ్ర తాంబూలం వేస్తున్నారట. గూగుల్ సెర్చ్‌లో నమ్మలేని మరెన్నో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, హరియాణా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వర్జినిటీ టెస్ట్ గురించే నెటిజన్లు ఎక్కువ సెర్చ్ చేస్తున్నారట.

  • Share this:
    భారతీయ సంస్కృతిలో సెక్స్ అనే పదం ఒకప్పుడు బహిరంగ నిషిద్ధం. సోషల్ మీడియా, ఇతరత్రా సాధనాల ప్రభావంతో సాధారణ స్థాయికి చేరుకుంటోంది. సంస్కృతి, వ్యక్తిత్వంలో వస్తున్న మార్పుల మూలంగా చాలా మంది శృంగారం గురించి మాట్లాడేందుకు పెద్దగా భయపడటం లేదు. పీరియడ్స్, వర్జినిటీ అనే పదాలు ఇప్పుడిప్పుడే మసకబారుతున్నాయి. సమాజం వీటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. పీరియడ్స్ రావడం, కొన్ని కారణాల వల్ల వర్జినిటీ కోల్పోవడం సాధారణమేనన్న ఆలోచన పెరుగుతోందని అనుకుంటున్నాం. అయితే, మన దేశంలో పెళ్లి కుమారులు ‘వర్జినిటీ’కే అగ్ర తాంబూలం వేస్తున్నారట. గూగుల్ సెర్చ్‌లో నమ్మలేని మరెన్నో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, హరియాణా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వర్జినిటీ టెస్ట్ గురించే నెటిజన్లు ఎక్కువ సెర్చ్ చేస్తున్నారట. పెరిగిన సంస్కృతి, సంప్రదాయ పద్ధతుల కారణంగా ఇలాంటివి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోందని ఓ అధ్యయనం పేర్కొంది.

    వర్జినిటీ టెస్ట్ ఫర్ విమెన్, వర్జినిటీ టెస్ట్ ఫర్ ఫీమేల్, ఇంట్లోనే వర్జినిటీ టెస్ట్ ఎలా చేయడం? తదితర కీ వర్డ్‌లను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు వెల్లడైంది. వధువు పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకుందో లేదో తెలుసుకునేందుకు ఇలాంటివి చెక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వధువు వర్జిన్ అయితే అదృష్టవంతులమని పెళ్లి కుమారులు భావిస్తున్నట్లు అధ్యయనం పేర్కొనడం గమనార్హం. కాగా, మహారాష్ట్రలోని కంజార్‌భట్ తెగతో పాటు మరికొన్ని సమూహాల్లో కన్యత్వ పరీక్షల ఆచారం కొనసాగుతుంది. పెళ్లయిన తరువాత తొలిరాత్రి వధువుకు కన్యత్వ పరీక్ష చేసే ఆచారం ఉంది. నవదంపతులు తొలి రాత్రి గడిపిన తరువాత వారి పడకపై ఉన్న దుప్పటిపై రక్తం మరక ఉందో లేదో చూసి పెళ్లికూతురు కన్యో కాదో నిర్ణయిస్తారు.

    మనదగ్గరే కాదు.. ఆర్మేనియా, జార్జియాతో పాటు, నార్త్ కాకసస్‌లో ఇలాంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. శోభనం జరిగిన తెల్లారి బెడ్‌షీట్‌ మీద మరకలను గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పరిశీలిస్తారు. ఈ సంప్రదాయాన్ని అక్కడ రెడ్ యాపిల్ అంటారు. ఇలాంటి చర్యలను మానక హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తూ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఫలితం నామమాత్రంగానే ఉంటోంది.
    First published: