ఎంతటి విషాదం.. భార్యను రక్షించబొయి మృత్యు ఒడిలోకి భర్త

మంటల్లో చిక్కుకున్న భార్యను కాసాడే ప్రయత్నంలో ఓ భర్త ప్రాణాలుకోల్పోయిన సంఘటన అబుదాబీలో చోటుచేసుకుంది.


Updated: February 18, 2020, 7:40 PM IST
ఎంతటి విషాదం.. భార్యను రక్షించబొయి మృత్యు ఒడిలోకి భర్త
Anil Ninan left with his wife Neenu and their four year old son
  • Share this:
ఆపదలో ఉన్న భార్యను రక్షించబోయి చివరకు మృత్యుఒడిలోకి చేరాడో భర్త. ఈ విషాదకరమైన సంఘటన అబుదాబీలో జరిగింది. కేరళకు చెందిన అనిల్‌ నైనన్‌ భార్య నీను.. కోడుకుతో కలిసి అబుదాబీలో నివసిస్తున్నారు.. వివారాల్లోకి వెళ్ళితే అల్ అరబ్ ఎమిరేట్స్  మీడియా తెలిపిన వివరాల ప్రకారం గత వారం రాత్రి సమయంలో వీరు ఉంటున్న అపార్టుమెంట్‌‌కు మంటలు అంటుకున్నాయి.  మంటలు  ప్లాట్‌ మెుత్తం వ్యాపించాయి. కారిడార్‌లో ఉన్న నైనన్‌ భార్య మంటల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని గమనించిన  అనిల్‌ తన భార్యను రక్షించడానికి ప్రయత్నించాడు.ఈ క్రమంలో ఇద్దరు ఆ మంటల్లో చిక్కుకుపోయారు.అనంతరం అక్కడి చేరుకున్న ఫైర్ సిబ్బంది వారిద్దరిని  బయటకు తీసుకువచ్చింది . భార్యాభర్తలకు తీవ్ర  గాయాలు కావడంతో ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అనిల్‌‌కు 90శాతం గాయాలు కావడంతో అతని ప్రాణాలు కాపాడలేకపోయినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అనిల్‌ నైనన్‌ భార్యకు 10 శాతం గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు వివరించారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసలు అనుమానిస్తున్నారు.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు