హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

బీ అలర్ట్.. కళ్ల ముందే ఘోరం.. సముద్రంలోనికి లాక్కెళ్లిన బలమైన అలలు... వీడియో వైరల్..

బీ అలర్ట్.. కళ్ల ముందే ఘోరం.. సముద్రంలోనికి లాక్కెళ్లిన బలమైన అలలు... వీడియో వైరల్..

నీటిలోపలికి కొట్టుకుని పోతున్న పిల్లలు

నీటిలోపలికి కొట్టుకుని పోతున్న పిల్లలు

Oman Beach: మహారాష్ట్రకు చెందిన కుటుంబం సరదాగా గడపటానికి ఒమన్ బీచ్ కు వెళ్లారు. సముద్రం దగ్గర అలల వద్ద పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది.

కొన్ని రోజులుగా ఆకాశానికి చిల్లుపడిందా.. అన్నట్లు వర్షం (Heavy rain) పడుతుంది. ఎక్కడ చూసిన.. చెరువులు, నదులు, ప్రాజెక్టులలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక సముద్రాలు కూడా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఇదే అదనుగా పర్యటకులు, సరదాగా సముద్రాలు, నదుల దగ్గరకు గడపటానికి వెళ్తున్నారు. కొన్ని సార్లు ఈ విహార యాత్రలు కాస్త అనుకొకుండా విషాద యాత్రలుగా మారిన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్ని చోట్ల చూస్తునే.. నీటిలో మునిగిపోయిన సంఘటనలు చూస్తుంటాం. మరికొందరు అత్యుత్సాహంతో నీటిలోకి దిగుతుంటారు. ఈ క్రమంలో నీటి ప్రవాహాంలో చిక్కుకుని సముద్రంలోనికి లాక్కెళ్లిపోతారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మహారాష్ట్రకు (Maharashtra) చెందిన శశికాంత్ మ్హమానే (42) అనే వ్యక్తి దుబాయ్ లోని ఓక కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, అతను తన భార్య పిల్లలు.. శృతి(9), శ్రేయస్ (6)లతో కలిసి ఒమన్ కు వెళ్లాడు. అక్కడ బీచ్ లో సరదాగా గడపాటానికి తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అయితే, వారంతా సముద్రం దగ్గర బీచ్ లో (Oman beach) ఆడుకుంటున్నారు.


అక్కడ సముద్రం నుంచి బలమైన అలలు ఎగిసి పడుతున్నారు. పిల్లలు.. అత్యుత్సాహంతో సముద్రం దగ్గరకు వెళ్లారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ ఉవ్వెత్తున అలలు ఎగిసి పడ్డాయి. అప్పుడు.. ఈ అలల్లో పిల్లలిద్దరు చిక్కుకున్నారు. నీటి లోపలికి కొట్టుకుపోయారు.

పిల్లలను కాపాడటానికి శశికాంత్ మ్హమానే ప్రయత్నించాడు. అతను కూడా నీళ్లలో కొట్టుకుపోయాడు. దీంతో ఒడ్డున ఉన్న వారంతా భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈత గాళ్లు వచ్చి రెస్క్యూ చేపట్టారు. అక్కడే ఉన్న మరో నీటి అలలను తన ఫోన్ లో రికార్డుచేస్తున్నాడు. దానిలో ఈ షాకింగ్ ఘటన రికార్డు అయ్యింది. ఈ క్రమంలో.. శశికాంత్ మ్హమానే, శ్రేయస్ శవాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి. మరో బాలిక శవం కోసం అధికారులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనతో బీచ్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media)  వైరల్ గా (viral video)  మారింది.

First published:

Tags: Maharashtra, Ocean, Viral Video