• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • INDIAN CRICKETERS RAVICHANDRAN ASHWIN HARDIK PANDYA DANCES FOR VAATHI COMING SONG MS

Vaathi Coming: మాస్టర్ స్టెప్ తో దుమ్మురేపిన అశ్విన్, పాండ్యా.. కుమ్మేసిన కుల్దీప్

Vaathi Coming: మాస్టర్ స్టెప్ తో దుమ్మురేపిన అశ్విన్, పాండ్యా.. కుమ్మేసిన కుల్దీప్

డాన్స్ తో దుమ్మురేపిన భారత క్రికెటర్లు (Image: Instagram)

Ashwin and hardik dance : ‘వాత్తి కమింగ్..’ పాట విజయ్ అభిమానులతో పాటు సంగీతాభిమానులను, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నది. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే.

  • News18
  • Last Updated:
  • Share this:
    దక్షిణాది సినిమా పరిశ్రమలో సంచలనాలు సృష్టించిన చిత్రం మాస్టర్. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘వాత్తి కమింగ్..’ పాట విజయ్ అభిమానులతో పాటు సంగీతాభిమానులను, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నది. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే.  సినిమా పరిశ్రమ నుంచే గాక క్రికెెటర్లు కూడా ఈ హుషారు గీతానికి కాలు కదిపారు.

    భారత్-ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇటీవలే ముగిసిన రెండో టెస్టులో కూడా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ పాటకు కాలు కదిపాడు. అయితే అది కొద్దిసేపే. తాజాగా ఇదే పాటకు రవిచంద్రన్ అశ్విన్ తో పాటు, భారత ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, మిస్టరీ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లు కలిసి డాన్స్ చేశారు.










    View this post on Instagram






    A post shared by Ashwin (@rashwin99)






    ఈ వీడియోను రవిచంద్రన్ అశ్విన్ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేశారు. వీడియోను షేర్ చేస్తూ.. తమ డాన్స్ తో వాత్తి కూడా సంతోషంగా ఉంటాడని అశ్విన్ రాసుకొచ్చాడు. ఇక వీడియోలో అశ్విన్ తానే పాటకు స్టెప్పులేస్తూ డాన్స్ ప్రారంభించగా.. వెనకాలే ఉన్న పాండ్యా అందుకుని తనదైన మార్కులో కాలు కదిపాడు. ఇక వీరిద్దరి వెనకాల ఉన్న కుల్దీప్ యాదవ్ అయితే డాన్స్ తో కుమ్మేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు