Indian boy make electric bike for 6 people : అవసరమే ఆవిష్కరణకు 'తల్లి' అని అంటారు. ఎవరికైనా అవసరంతో పాటు వనరుల కొరత ఉన్నప్పుడు..వారి నుంచి ఒక్కోసారి ప్రపంచం చూసే ఆవిష్కరణలు వస్తాయి.. ఒక భారతీయ యువకుడు, అతని సహచరులు అదే చేశారు. ఓ యువకుడు 6 మంది కలిసి ప్రయాణించగలిగే ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశాడు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(Anand mahindra) ఎల్లప్పుడూ భారతీయ ప్రతిభను ప్రోత్సహిస్తుంటారు. సోషల్ మీడియాలో సామాన్యులకు సంబంధించిన పోస్ట్‌లను షేర్ చేస్తూనే ఉంటారు. ఇటీవల అతను ఒక యువకుడి వీడియోను పోస్ట్ చేశాడు, అందులో ఓ యువకుడు ప్రత్యేకమైన బైక్-ఆటో రిక్షా(Electric bike cun auto rickshaw)ను నడుపుతున్నాడు. మీరు ఈ వాహనాన్ని ఎలక్ట్రిక్ బైక్ లేదా ఆటో రిక్షా అని కూడా పిలవవచ్చు. ఎందుకంటే దీనిపై ఒకేసారి 6 మంది కూర్చోగలరు. "చిన్న మార్పుల తర్వాత, ఈ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించవచ్చు. యూరప్‌లోని రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాలలో ఈ వాహనాన్ని టూర్ బస్సుగా ఉపయోగించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా ఆవిష్కరణలను చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను"అంటూ ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
12 వేల రూపాయల వాహనం , 10 రూపాయలు వసూలు చేస్తారు
వీడియోలో, యువకుడు గ్రామంలో ప్రత్యేకమైన బైక్‌ను నడుపుతున్నాడు. అతను బైక్ ముందు కూర్చున్నాడు. అతని వెనుక మరో 5 సీట్లు ఉన్నాయి. ఒక టైరు ముందు, ఒకటి వెనుక ఉంది. బైక్‌పై ముందు భాగంలో LED లైట్ కూడా ఉంది. బైక్‌ను తానే తయారు చేశానని, దాని ధర 12 వేల రూపాయలు అని యువకుడు చెప్పాడు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు నడుస్తుండగా, దీన్ని ఛార్జ్ చేయడానికి రూ.10 మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపాడు.
PM Modi : దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడు నిర్వహించని మెగా రోడ్ షో చేసిన మోదీ
With just small design inputs, (cylindrical sections for the chassis @BosePratap ?) this device could find global application. As a tour ‘bus’ in crowded European tourist centres? I’m always impressed by rural transport innovations, where necessity is the mother of invention. pic.twitter.com/yoibxXa8mx
— anand mahindra (@anandmahindra) December 1, 2022
లోపాలను చెప్పిన నెటిజన్లు
ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే చాలా మంది తమ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం ద్వారా అందించారు. చాలా మంది ఈ ప్రత్యేకమైన ఆలోచనను ప్రశంసించారు, కొందరు దాని లోపాలను కూడా లెక్కించారు. ఒక వ్యక్తి "ఈ వాహనం జూ, పార్క్ కార్పొరేట్ కాంప్లెక్స్ వంటి ప్రదేశాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, కానీ రద్దీగా లేదా రోడ్డు మీద నడపడం సురక్షితం కాదు. దీనికి కారణాలు తక్కువ టర్నింగ్ రేడియస్, కార్నర్ చేస్తున్నప్పుడు సెంట్రిఫ్యూగల్ బ్యాలెన్స్, కఠినమైన రోడ్లపై సస్పెన్షన్, లగేజీ స్థలం లేకపోవడం అధిక లోడ్‌లో బ్యాటరీ సామర్థ్యం తక్కువ"అని తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anand mahindra, Electric bike, Viral Video