Home /News /trending /

INDIAN BOXER WORKING AT THE PARKING COUNTER PRV

Viral News: పార్కింగ్ కౌంటర్లో పనిచేస్తున్న భారత మహిళా బాక్సర్

బాక్సర్​ రీతూ

బాక్సర్​ రీతూ

ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా మంది క్రీడాకారులు ఇబ్బందులు పడతారు. అప్పుడప్పుడూ ఆటగాళ్లు తమ ఆటను వదులుకోవలసి వస్తుంది కూడా. ఛండీగఢ్‌కు చెందిన బాక్సర్ రీతూది ఇదే కథ. ఒకప్పుడు జాతీయ స్థాయి క్రీడాకారిణి. కానీ, నేడు ఆమె ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది.

ఇంకా చదవండి ...
    టోక్యో ఒలింపిక్స్‌పై దేశం మొత్తం దృష్టి ఉంది.  మన దేశంలోని చాలా మంది యువత తమ పేరును చరిత్రలో లిఖించుకుంటున్నారు. ఈ ఆటల సమయంలో పతకాలు తెచ్చే క్రీడాకారుల గురించి జనం చాలా ఆరా తీస్తారు. కానీ, తరువాత వాటిని మరచిపోతారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా  నైపుణ్యం ఉన్న చాలా మంది క్రీడాకారులు ఇబ్బందులు పడతారు. అప్పుడప్పుడూ ఆటగాళ్లు తమ ఆటను  వదులుకుంటారు కూడా. ఛండీగఢ్‌కు చెందిన బాక్సర్​ రీతూది ఇదే కథ. ఒకప్పుడు జాతీయ స్థాయి క్రీడాకారిణి. కానీ, నేడు ఆమె ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. పార్కింగ్​ టికెట్​ కౌంటర్​ వద్ద పనిచేస్తోంది. రీతూ తన కుటుంబంతో కలిసి ధనస్‌లోని ఒక చిన్న ఫ్లాట్‌లో నివసిస్తోంది. రీతు తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. నెలకు మందుల ఖర్చు రూ. 10,000  వరకు అవుతోంది. ఇంట్లో తండ్రి మాత్రమే సంపాదిస్తాడు, అతను అనారోగ్యానికి గురైనప్పుడు, ఇంటి ఖర్చులు భరించడం కష్టం. అటువంటి పరిస్థితులలో రీతూ కూడా చదువు వదిలి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. రీతు సెక్టార్ 22 లోని పార్కింగ్ స్లాట్‌లో పనిచేస్తోంది.



    రీతూ బాక్సింగ్‌లో జాతీయ స్థాయి ఛాంపియన్. బాక్సింగ్​లో చాలా పతకాలు కూడా సాధించింది. 12 వ తరగతి చదివింది. కానీ ఆమె తండ్రి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో, ఇంటి ఆర్థిక పరిస్థితిని చూసిన తర్వాత ఆమె చదువును కొనసాగించలేకపోయింది. అన్నయ్య రంజిత్ కూడా ఇంట్లో పరిస్థితి చూసి చదువు మధ్యలోనే ఆపేశాడు. ఇంటి పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అందుకే పార్కింగ్ స్లాట్‌లో పని చేయాల్సి వస్తోందని రీతు చెప్పింది. తనకు చదువు కొనసాగించాలని ఉందని, బాక్సింగ్​ తన ఫ్యాషన్​ అని తెలిపింది. తనకు అవకాశం ఇస్తే బాక్సింగ్​లో దేశం పేరు నిలబెడుతానని పేర్కొంది. సైన్యంలో చేరి దేశ సేవ చేస్తానని పేర్కొంది. ఆర్మీ పరీక్షలు కూడా రాస్తున్నట్లు తెలిపింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Boxing, Financial problem, India, Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు