హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

PV Sindhu: చీర కట్టుకొని చిందేసిన పీవీ సింధు .. బ్యాడ్మింటెన్ స్టార్ డ్యాన్స్ వీడియో ఇదిగో

PV Sindhu: చీర కట్టుకొని చిందేసిన పీవీ సింధు .. బ్యాడ్మింటెన్ స్టార్ డ్యాన్స్ వీడియో ఇదిగో

pv sinhu (Photo:Instagram)

pv sinhu (Photo:Instagram)

PV Sindhu: గతంలో కచ్చా బాదమ్ , అరబిక్ కుతు సాంగ్‌కి డ్యాన్స్ ఇరగదీసిన పీవీ సింధు రీసెంట్‌గా జిగిల్ జిగిల్ అనే హిట్‌ సాంగ్‌కు చీరకట్టుకొని మరీ స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఆ వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారత బ్యాడ్మింటెన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu)స్పోర్ట్స్‌లోనే కాదు సోషల్ మీడియా(Social media)లో కూడా అంతకు రెట్టింపు క్రేజ్ సొంతం చేసుకున్నారు. షటిల్ బ్యాట్‌తో కోర్టులో ప్రత్యర్ధికి చెమటలు పట్టించే పీవీ సింధు హ్యాపీ మూడ్‌లో హిట్ సాంగ్‌కి స్టెప్పులు వేయడం హాబీగా మార్చుకున్నారు. గతంలో కచ్చా బాదమ్, అరబిక్ కుతు సాంగ్‌కి డ్యాన్స్ ఇరగదీసిన పీవీ సింధు రీసెంట్‌గా జిగిల్ జిగిల్ అనే హిట్‌ సాంగ్‌కు చీరకట్టుకొని మరీ స్టెప్పులు వేసింది. ఈ వీడియో(Viral video)లో పీవీ సింధు ప్రొఫెషనల్ డ్యాన్సర్ వేసినట్లుగా స్టైలీష్‌గా మూమెంట్స్ చేసింది. సింధు లేటెస్ట్ డ్యాన్స్ వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Hardik Pandya: అయ్యో, హార్దిక్ కి ఎంత కష్టమొచ్చింది.. తీవ్రబాధలో టీమిండియా స్టార్ ప్లేయర్!

చీరలో స్టెప్పులు వేసిన సింధు..

ఆట అవార్డుల కోసం పాటలు, డ్యాన్సులు ఉల్లాసానికి, ఉత్సాహానికి అన్నట్లుగా ఫీలవుతోంది బ్యాడ్మింటెన్ స్టార్ పీవీ సింధు. ఫోటోషూట్స్ , సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ ఫ్యాన్స్‌ని , ఫాలోవర్స్‌కి తన అప్‌డేట్స్‌ని షేర్ చేస్తున్న ఈ షట్లర్ స్టార్ హీరోయిన్లు, మిగిలిన మోడల్స్‌ను తలదన్నే స్టైల్లో తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పీవీ సింధు బాగా పాపులర్ అయిన జిగిల్ జిగిల్ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. కనకాంబ్రం కలర్ చీరలో సాంగ్‌కి తగ్గట్లుగా అదిరిపోయే స్టెప్పులతో అభిమానులను ఆశ్చర్యపరిచింది.

View this post on Instagram

A post shared by Sindhu Pv (@pvsindhu1)

జిగిల్ జిగిల్ డ్యాన్స్ ..

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పీవీ సింధు తన లేటేస్ట్ డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది. గంటల వ్యవధిలోనే ఈ వీడియోని మూడున్నర లక్షల మంది చూశారంటే పీవీ సింధుకు సోషల్ మీడియాలో క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అంతా సూపర్ మేడమ్, క్యూట్, ఆసమ్ అంటూ పొడగ్తలతో ముంచెత్తుతున్నారు. పీవీ సింధుకు డ్యాన్స్ చేయడం కొత్తేమి కాకపోయినా ఈ రేంజ్‌లో శారీలో స్టెప్పులు వేయడం కాస్త కొత్తగానే ఉంది. అందుకే వీడియో వైరల్ అవుతోంది.

IND vs PAK : మాటల యుద్ధం షురూ.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ తిక్క కుదిర్చిన అశ్విన్..

రెస్ట్ టైమ్‌లో జల్సా ..

గత వారం జాతీయ క్రీడల ప్రారంభ వేడుకుల కోసం గుజరాత్ వెళ్లిన సింధు.. గుజరాతీ బట్టలు ధరించి సంప్రదాయ గార్బా డ్యాన్స్ చేసింది. ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం కైవసం చేసుకున్న సింధు చిన్న గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి వైదొలిగింది. తొందర్లోనే తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులోకి రావాలని చూస్తోంది. డిసెంబర్ లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో పాల్గొనేందుకు సింధు సిద్ధం అవుతోంది.

First published:

Tags: Pv sindhu, Telangana News, Viral Video

ఉత్తమ కథలు