Indian Army: ఆర్మీ డాక్టర్ల రేర్ ఫీట్..16 వేల అడుగుల ఎత్తున సర్జరీ

Image credits ANI

భారత ఆర్మీ వైద్యులు గొప్ప ఫీట్ సాధించారు. తూర్పు లఢక్ లో అత్యంత ఎత్తున ఉన్న మంచు కొండల్లో వారు ఒక సైనికుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.

  • News18
  • Last Updated :
  • Share this:
    భారత ఆర్మీకి చెందిన వైద్య బృందం అత్యద్భుత ఫీట్ సాధించింది. మనిషి సాధారణంగా ఉండటానికే అత్యంత గడ్డుపరిస్థితులుండే ఎత్తైన ప్రాంతంలో ఏకంగా ఓ సైనికుడికి శస్త్రచికిత్సనే నిర్వహించింది. 16 వేల అడుగుల ఎత్తులో ఒక సైనికుడికి ఆపరేషన్ నిర్వహించి రికార్డు నెలకొల్పింది. సాధారణంగా ఇలాంటి ప్రదేశంలో ఆపరేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న విషయమనీ, కానీ ఆర్మీ వైద్య బృందం దీనిని ఒక సవాల్ గా తీసుకుని సైనికుడి ప్రాణాలు కాపాడగలిగాయని వైద్యులు అంటున్నారు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇంతకీ వైద్యులు అక్కడ వైద్యం చేయాల్సి వచ్చింది...?

    తూర్పు లఢక్ లో అత్యంత కఠినమైన పరిస్థితులుంటాయి. చలికాలంలో అయితే అక్కడ అంతా మంచు దుప్పటి పరిచి ఉంటుంది. ఎత్తైన కొండల వద్ద డ్యూటీ చేయడమంటే అది సాధారణమైన విషయం కాదు. కానీ ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు అక్కడ డ్యూటీ చేస్తుంటారు. ఈనెల 28న అలా డ్యూటీ చేస్తూ ఒక సైనికుడు అపెండెక్స్ వచ్చింది. ఆ సైనికుడిని చాపర్ ద్వారా కిందికి తీసుకెళ్లలేని పరిస్థితి. దీంతో అక్కడ సమీపాన ఉన్న వైద్యులకు సమాచారమందించాడు ఆ సైనికుడి కెప్టెన్.

    దీంతో హుటాహుటిన అక్కడకు వెళ్లిన వైద్య బృందం.. ఫార్వర్డ్ సర్టికల్ సెంటర్ (ఎఫ్ఎస్సీ) ని ఏర్పాటుచేసింది. 16 వేల అడుగుల ఎత్తున.. గడ్డకట్టే ఉష్ణోగ్రత నమోదవుతున్నా.. ఆ వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స చేసి సైనికుడిని కాపాడారు. ఆ సమయంలో వారు ప్రతికూలతలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆపరేషన్ మాత్రం విజయవంతమైందని వారు తెలిపారు. భారత ఆర్మీ వైద్య బృందం సాధించిన విజయాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

    ఎందుకు రేర్ ఫీట్..?
    ఆర్మీ వైద్యుల ప్రయత్నాన్ని సోషల్ మీడియాలో చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఒక రోగికి అంత ఎత్తులో చికిత్స చేయడమనేది మాములు విషయం కాదని అంటున్నారు. ఇదే విషయమై పలువురు వైద్యులు స్పందిస్తూ.. అధిక ఎత్తులో ఉండే ప్రాంతంలో వాతావరణ పీడనం, ఆక్సిజన్ సాంద్రత తక్కువగా ఉంటాయని, అత్యధికంగా మంచు లేదా సముద్ర తీర ప్రాంతాలలో వైద్య పరికరాలు సరిగా పనిచేయవని వారు తెలిపారు. అంతేగాక రోగికి కూడా ఎక్కువగా ప్రమాదం పొంచి ఉంటుందని చెబతున్నారు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఆ వైద్యులు మాత్రం వారి పనిని విజయవంతంగా పూర్తి చేయడాన్ని ఇతర వైద్యులు ప్రశంసిస్తున్నారు.

    తూర్పు లఢక్ ప్రాంతం.. అత్యంత కఠినమైన ప్రదేశం. వాతావరణ పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉంటాయిక్కడ. ఏడాదంతా మంచు కురిసే చోట.. మన సైనికులు సరిహద్దుల వెంట నిలబడి.. శత్రువు నీడ మనమీద పడకుండా కాపాడతారు.
    Published by:Srinivas Munigala
    First published: