Home /News /trending /

INDIA SUSPENDS TOURIST VISAS OF CHINESE NATIONALS IN TIT FOR TAT MOVE PAH

China: కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. చైనాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భారత్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chinese: భారత్ పొరుగున్న ఉన్న డ్రాగన్ దేశానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. తాజాగా, చైనా జాతీయుల టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేస్తు సంచలన నిర్ణయం తీసుకుంది.

India suspends tourist visas of Chinese: గ్లోబల్ ఎయిర్‌లైన్స్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA)అనే సంస్థలో భారత్ కూడా ఒక  సభ్యదేశం. ఇది.. ఏప్రిల్ 20న మన దేశంలోని  చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలను జారీ చేసింది. దీన్ని తాజాగా, భారత్ రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. కాగా, చైనాలోని పలు విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్నసుమారు.. 22,000 వేల మంది  భారత విద్యార్థులు అక్కడికి వెళ్ళలేని దుస్థితిపై భారత్ డ్రాగన్ దేశంతో చర్చించింది. దీనిపై ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎలాంటి ప్రతి స్పందన రాలేదు. దీంతో వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రస్తుతం ఆగమ్య గోచరంగా మారింది. 2020లో చైనా లో కరోనా మహమ్మారి తొలివేవ్ ప్రారంభమైనప్పుడు, విద్యార్థులు భారత్ దేశానికి వచ్చేశారు.

ఇప్పటి వరకు వారికి అక్కడి విశ్వవిద్యాలయాలు ఎలాంటి సమాచారం తెలపడం లేదు. అదే విధంగా ఆదేశం అధికారులు కూడా.. భారత్ చేసిన విన్నపాన్ని ఖాతరు చేయడం లేదు. దీంతో .. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) "చైనా (పీపుల్స్ రిపబ్లిక్) పౌరులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవని భారత్ స్పష్టం చేసింది. IATA అనేది గ్లోబల్ ఎయిర్‌లైన్స్ బాడీ, దీనిలో దాదాపు 290 మంది సభ్యులు ఉన్నారు. ఇది గ్లోబల్ ఎయిర్ ట్రాఫిక్‌లో 80 శాతానికి పైగా ఉంది. అదే విధంగా,ఇక మీదట.. కింది ప్రయాణీకులు భారతదేశంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని పేర్కొంది.. భూటాన్, భారతదేశం, మాల్దీవులు, నేపాల్ జాతీయులు భారతదేశం జారీ చేసిన నివాస అనుమతితో ప్రయాణీకులు, భారత్ లోనికి అనుమతించబడతారు.

కఠినమైన ఆంక్షల కొనసాగింపు వలన.. వేలాది మంది భారతీయ విద్యార్థుల విద్యా వృత్తిని ప్రమాదంలో పడేస్తున్నందున ఈ విషయంలో “సహకార వైఖరి” అవలంబించాలని భారతదేశం బీజింగ్‌ను కోరిందని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి మార్చి 17న తెలిపారు. చైనా ఈ విషయాన్ని సమన్వయంతో పరిశీలిస్తోందని, విదేశీ విద్యార్థులను తిరిగి చైనాకు అనుమతించే ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫిబ్రవరి 8న పేర్కొన్నారని బాగ్చి చెప్పారు. కానీ ఇప్పటి వరకు, భారతీయ విద్యార్థుల పునరాగమనం గురించి చైనా వైపు ఎటువంటి చర్యలు తీసుకొలేదని స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై భారత్ సీరియస్ అయ్యింది.. తమ విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా సహృదయ వైఖరిని అవలంబించాలని మేము చైనా పక్షాన్ని కోరుతూనే ఉంటామని భారత్ తెలిపింది.

గత ఏడాది సెప్టెంబరులో దుషాన్‌బేలో జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కూడా ఈ సమస్యను ప్రస్తావించారని, బాగ్చి చెప్పారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశం సందర్భంగా ఇద్దరు విదేశాంగ మంత్రులు తాజిక్ రాజధాని నగరంలో చర్చలు జరిపారు. కానీ ఇప్పటి వరకు దీనిపై చైనా నుంచి ఎలాంటి పురోగతి లేని తరుణంలో భారత్ ఈ కఠిన నిర్ణయానికి ఉపక్రమించింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: China, Covid -19 pandemic, Students, Visa

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు