Real Estate: కొత్తగా ఇల్లు కొనడానికి ఇది సరైన సమయమేనా?.. తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా తరువాత సొంత ఇల్లు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందా? తగ్గిందా? అనే ప్రశ్నలకు తాజా అధ్యాయనంలో సమాధానం దొరికింది.

  • Share this:
కరోనా తరువాత సొంత ఇల్లు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందా? తగ్గిందా? అనే ప్రశ్నలకు తాజా అధ్యాయనంలో సమాధానం దొరికింది. రియల్ ఎస్టేట్ రంగంపై చేసిన తాజా సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ నోబ్రోకర్.కామ్ చేసిన ఈ సర్వే నివేదికను 'ఇండియా రియల్ ఎస్టేట్ రిపోర్ట్ 2020' పేరుతో తాజాగా విడుదల చేశారు. కొత్త ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయమని సర్వేలో పాల్గొన్న 89శాతం మంది భావిస్తున్నారు. దిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు, ముంబై, పుణె, చెన్నై, హైదరాబాద్‌లలో రియల్ ఎస్టేట్ రంగంపై సర్వే నిర్వహించారు. ఈ సంవత్సరం కోవిడ్-19 కారణంగా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయమని చెప్పాయి. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్య పెరిగింది. ఇది కూడా కొత్త ఇంటిపై ఆసక్తి పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే ఎక్కువమంది ఉద్యోగులు ఇప్పుడు ఇంటిని సొంతం చేసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు. హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గడం, కస్టమర్లకు మంచి ఆఫర్లు, బిల్డర్ డిస్కౌంట్లు లభిస్తుండటంతో ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు వేస్తున్నారు .

* బడ్జెట్ పెరిగింది
2021లో కొత్త ఇల్లు కొంటామని సుమారు 82శాతం మంది చెప్పారు. వీరిలో ఎక్కువమంది మిలీనియల్స్ ఈ సంవత్సరం ఇల్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారని సర్వే వెల్లడించింది. గతేడాది 25-40 సంవత్సరాల వయసున్నవారిలో 49శాతం మంది కొత్తగా ఇల్లు కొన్నారు. ఈ సంవత్సరం ఇది 63 శాతానికి చేరుకుంది. ఇంటికి కేటాయించే బడ్జెట్‌లో కూడా గణనీయమైన పెరుగుదల ఉందని సర్వే వెల్లడించింది. రూ.60 లక్షలలోపు ఫ్లాట్ కొనాలనుకుంటున్నట్లు దాదాపు 58శాతం మంది చెప్పారు. 13 శాతం మంది రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షలు బడ్జెట్ పెట్టుకున్నారు. 19 శాతం మంది రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల బడ్జెట్‌లో ఆస్తిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. కనీసం 11 శాతం మంది కోటి రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయిస్తామన్నారు.

* వాటిపైనే ఆసక్తి
29 శాతం మంది ప్రజలు 3BHKను, 48శాతం మంది 2BHKను కోరుకుంటున్నారు. సుమారు 57 శాతం మంది కొనుగోలుదారులు రెడీ-టు-మూవ్-ఇళ్లను ఇష్టపడుతున్నారు. 27 శాతం మంది రీసేల్ హౌజ్‌ కోసం చూస్తున్నారని సర్వే తెలిపింది. నిర్మాణంలో లేని ఆస్తులపై కొనుగోలుదారులకు నమ్మకం తగ్గిపోయింది. కేవలం 16 శాతం మంది మాత్రమే వాటిపై ఆసక్తి చూపించారని సర్వే పేర్కొంది. 89 శాతం మంది కొనుగోలుదారులు సొంత అవసరాల కోసం ఆస్తిని కొనాలని చూస్తుండగా, 11 శాతం మంది పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు. బెంగళూరులోని బనశంకరి, వైట్‌ఫీల్డ్, చెన్నైలోని మడిపక్కం, పెరంబూర్, దిల్లీలో ద్వారకా, రోహిణి, హైదరాబాద్‌లోని మాదాపూర్, కూకట్‌పల్లి, ముంబైలోని పన్వెల్, థానే వెస్ట్ వంటి ప్రాంతాల్లో ఇళ్లకు మంచి డిమాండ్ ఉందని సర్వే ద్వారా తెలిసింది.
Published by:Sumanth Kanukula
First published: