నిజాం సొమ్ము వారసులకు దక్కుతుందా? పాకిస్తాన్ చేతికి వెళ్తుందా?.. బ్రిటన్ కోర్టులో కేసు..

Hyderabad Nizam: 1948లో హైదరాబాద్‌ నిజాం బ్రిటన్‌లోని పాకిస్థాన్‌ హై కమిషనర్‌ హబీబ్‌ ఇబ్రహీం రహీముతుల్లాకు పది లక్షల పౌండ్లు బదిలీ చేసి, భద్రంగా ఉంచాలని కోరారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌ పీఎల్‌సీలో ఈ నిధులు ఉన్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 26, 2019, 1:32 PM IST
నిజాం సొమ్ము వారసులకు దక్కుతుందా? పాకిస్తాన్ చేతికి వెళ్తుందా?.. బ్రిటన్ కోర్టులో కేసు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది దేశ విభజన సమయం.. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో కలపాలా? లేక పాకిస్తాన్‌లో కలపాలా? అని ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ సంశయంలో ఉన్న రోజులు.. తన వద్ద ఉన్న 35 మిలియన్ పౌండ్లను (దాదాపు రూ.300 కోట్లు) లండన్‌లోని ఓ బ్యాంకులో దాచారు.. అయితే, ఆ విషయంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయ వివాదం తుది దశకు చేరుకుంది. దానికి సంబంధించిన తీర్పు మరి కొన్ని వారాల్లో వెలువడబోతోంది. వివరాల్లోకెళితే.. 1948లో హైదరాబాద్‌ నిజాం బ్రిటన్‌లోని పాకిస్థాన్‌ హై కమిషనర్‌ హబీబ్‌ ఇబ్రహీం రహీముతుల్లాకు పది లక్షల పౌండ్లు బదిలీ చేసి, భద్రంగా ఉంచాలని కోరారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌ పీఎల్‌సీలో ఈ నిధులు ఉన్నాయి. వడ్డీతో కలిపి ఇప్పుడు ఆ సొమ్ము 3.5 కోట్ల పౌండ్లకు చేరింది. అయితే, ఆ డబ్బు తమకే చెందుతుందని నిజాం వారసులు ప్రిన్స్‌ ముకరంజా, ముఫఖంజా వాదిస్తున్నారు. వారికి భారత్‌ మద్దతు ఇస్తోంది.

పాక్‌ మాత్రం అది తమ సొమ్మేనంటోంది. ఈ కేసును అక్కడి కోర్టు జడ్జి జస్టిస్‌ మార్కస్‌ స్మిత్‌ రెండు వారాల పాటు విచారణ సాగించారు. దీనికి సంబంధించి మరో ఆరు వారాల్లో తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజాం ఉస్మాన్‌ అలీ ఖాన్‌కు చెందిన నిధులకు యజమాని ఎవరన్నది కోర్టు తేల్చాల్సి ఉంది. నిజాం వారసులిద్దరి వయసు 80 ఏళ్లు దాటిన నేపథ్యంలో.. తాత కానుక తమకు అందుతుందా? లేదా? అని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, నిజాం తన మరణానికి రెండేళ్ల ముందు అంటే.. 1965లో ఆ సొమ్మును భారత్‌కు అప్పగిస్తూ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.


First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు