హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Alcohol Museum: ఆ మ్యూజియం మొత్తం ఆల్కహాలే.. ఎక్కడ లాంచ్ చేశారో తెలుసా..

Alcohol Museum: ఆ మ్యూజియం మొత్తం ఆల్కహాలే.. ఎక్కడ లాంచ్ చేశారో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Alcohol Museum: ఇప్పటివరకు పురావస్తు, ఆర్ట్, సైన్స్ ఇలా అనేక మ్యూజియాల గురించి విన్నాం, చూశాం. కానీ కేవలం ఒక్క ఆల్కహాల్‌ చరిత్ర తెలియజేయడం కోసమే నిర్మించిన మ్యూజియాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? అది కూడా మన ఇండియాలో దర్శనమిస్తుందని ఊహించారా? ఈ తరహా మ్యూజియం తాజాగా గోవాలో ప్రారంభమైంది.

ఇంకా చదవండి ...

ఇప్పటివరకు పురావస్తు, ఆర్ట్, సైన్స్ ఇలా అనేక మ్యూజియాల గురించి విన్నాం, చూశాం. కానీ కేవలం ఒక్క ఆల్కహాల్‌ చరిత్ర తెలియజేయడం కోసమే నిర్మించిన మ్యూజియాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? అది కూడా మన ఇండియాలో దర్శనమిస్తుందని ఊహించారా? ఈ తరహా మ్యూజియం తాజాగా గోవాలో ప్రారంభమైంది. ఇది ఆల్కహాల్ తయారీ చరిత్రకు అంకితం చేసిన తొలి భారతీయ మ్యూజియం కావడం విశేషం. గోవా మద్యపాన వారసత్వాన్ని ప్రోత్సహించడానికే తప్ప ఆల్కహాల్ వినియోగాన్ని పెంచడానికి కాదని ఈ మ్యూజియం వ్యవస్థాపకులు నందన్ కుడ్చడ్కర్ (Nandan Kudchadkar) వెల్లడించారు.

Viral Photos: విచిత్రమైన ఫొటోలు.. మీరు చూస్తే కచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు..


ఈ మ్యూజియంలో 1950 కాలం నాటి ఫెని (పులియబెట్టిన జీడిపప్పు లేదా కొబ్బరి నీళ్ల నుంచి తయారు చేసిన ఆల్కహాలిక్ డ్రింక్) బాటిళ్లు, ఫెని డ్రింక్ సర్వింగ్ గ్లాస్‌లు, పాత చెక్క డిస్పెన్సర్‌లు, కొలిచే పరికరాలు ఉన్నాయి. గోవాలో జీడిపప్పుతో మద్యం తయారు చేసే కలను ప్రోత్సహించే లక్ష్యంతోనే వీటిని ప్రదర్శించారు. మ్యూజియం యజమాని, స్థానిక పారిశ్రామికవేత్త నందన్ కుడ్చడ్కర్ మాట్లాడుతూ.. ఆల్ ఎబౌట్ ఆల్కహాల్ (All About Alcohol) ప్రపంచ చరిత్రలోనే మద్యం కాచే చరిత్రకు అంకితమిచ్చిన మొట్టమొదటి మ్యూజియం అని పేర్కొన్నారు. ఈ మ్యూజియం లక్ష్యం మద్యం వినియోగాన్ని ప్రోత్సహించడానికి కాదని చెప్పారు.

Viral Video: పెళ్లిలో వధువు చేసిన పనికి అందరూ షాక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో..


ఆల్కహాల్ మ్యూజియం అంటే ఏమిటి?

ఈ ఆల్కహాల్ మ్యూజియాన్ని 1,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్తర గోవా బీచ్ తీరప్రాంతంలో నిర్మించారు. ఇది సిన్క్వెరిమ్, కాండోలిమ్ టూరిజం హబ్‌ను కనెక్ట్ చేసే ఓ బిజీ లేన్‌లో ఉంటుంది. అలాగే పనాజీకి దాదాపు 10 కిమీ దూరంలో ఉంటుంది. 'ఆల్ ఎబౌట్ ఆల్కహాల్' రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన మద్యం ఫెని(Feni) తయారీ విధానం గురించి తెలియజేస్తుంది. జీడిపప్పు యాపిల్‌తో గతంలో ఈ మద్యాన్ని ఎలా కాచారు? ఇప్పుడెలా కాస్తున్నారు? అనే విషయాలు కూడా ఈ మ్యూజియంకి వచ్చి తెలుసుకోవచ్చు.

మ్యూజియం లోపల నాలుగు గదులలో వివిధ పాత మట్టి కుండలు, 16వ శతాబ్దానికి చెందిన ఫెని సర్వింగ్ పరికరాలు, ఒక పురాతన చెక్క షాట్ డిస్పెన్సర్, ఫెని గాఢతను కొలవడానికి ఉపయోగించే 'గర్వ్' (స్కేల్), రష్యా నుంచి సేకరించిన క్రిస్టల్ ఆస్ట్రేలియన్ బీర్ గ్లాస్ ప్రదర్శనకు పెట్టారు. ఈ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన గ్లాస్‌వేర్, చాలీస్(chalices), స్నిఫ్టర్స్(snifters), వంపుతిరిగిన వైన్ గ్లాసెస్, ప్రపంచంలోనే ఎత్తైన పోలాండ్ షాట్ గ్లాస్(shot glass) ఇతర వస్తువులను కూడా చూడొచ్చు. మ్యూజియంలో ఒక సెల్లార్ కూడా ఉంది. ఇక్కడ 1950 కాలం నాటి జీడిపప్పు, కొబ్బరి ఫెని సీసాలు వరుసగా ప్రదర్శనకు పెట్టారు.

Guinness World Record: నిజంగా ఇది అద్భుతమే.. ఒక్క టమాటా చెట్టుకు 839 పండ్లు.. ఎలా సాధ్యం అంటే..


ఈ మ్యూజియంలో మునుపటి కాలంలో ఫెని తయారీకి ఉపయోగించే వివిధ పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. మ్యూజియంలోని నాలుగు గదులలో ఒకటి పాత స్టవ్‌లు, స్పూన్లు, మోర్టార్, పెస్టిల్స్, గ్రైండర్‌లు సహా గోవా సంస్కృతికి సంబంధించిన ఇతర వస్తువులకు ప్రదర్శనకు ఉంచారు. కుడ్చడ్కర్ తన తండ్రితో కలిసి తిరుగుతున్న సమయంలో పురాతన వస్తువులను సేకరించే అభిరుచిని పెంచుకున్నారు. మూడు దశాబ్దాల క్రితం అటువంటి వస్తువులను సేకరిస్తున్నానని వెల్లడించారు.

First published:

Tags: Goa, Trending news

ఉత్తమ కథలు