Home /News /trending /

INDIA MAY BE APPLE NEXT BIG PRODUCTION HUB BS

Apple | యాపిల్ చూపు భారత్ వైపు.. చైనా ఎఫెక్ట్..

యాపిల్ సంస్థ (image: Apple)

యాపిల్ సంస్థ (image: Apple)

భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించుకొనేందుకు, మార్కెట్‌ను పెంచుకొనేందుకు యాపిల్ కంపెనీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం చైనాలో కొనసాగుతున్న ఉత్పత్తి కార్యకలాపాల్లో ఐదో వంతును భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తోంది.

    భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించుకొనేందుకు, మార్కెట్‌ను పెంచుకొనేందుకు యాపిల్ కంపెనీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం చైనాలో కొనసాగుతున్న ఉత్పత్తి కార్యకలాపాల్లో ఐదో వంతును భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్ తయారీ కాంట్రాక్టులను ఫాక్స్‌కాన్‌, విస్ట్రన్‌ లాంటి సంస్థలకు ఇస్తున్న యాపిల్‌.. భారత్‌లో దాదాపు 4 వేల కోట్ల డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను తయారుచేసేందుకు ఈ కాంట్రాక్టర్లను ఉపయోగించుకోనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వార్తలు కూడా ఊపందుకున్నాయి. ఇప్పటికే భారత్‌లో ఐఫోన్‌-7, ఐఫోన్‌-ఎక్స్‌ఆర్‌ మోడళ్లను తయారు చేస్తున్న యాపిల్ కంపెనీ గతంలో ఐఫోన్‌-ఎస్‌ఈ, ఐఫోన్‌-6ఎస్‌ మోడళ్లను కూడా తయారు చేసింది. కానీ, ఆ తర్వాత ఆ రెండు మోడళ్లను ఉత్పత్తుల జాబితాను తొలగించింది.

    ఇప్పుడు రీసెల్లర్ల ద్వారా అమ్మకాలు చేస్తుండగా, వచ్చే ఏడాది భారత్‌లో యాపిల్‌ తొలి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కరోనా వైరస్ నేపథ్యం సహా లోకల్‌ సోర్సింగ్‌ నిబంధనల్లో భారత ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల ద్వారా కూడా లబ్ధి పొందాలని యాపిల్‌ చూస్తున్నట్లు తెలుస్తోంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Apple, Business, BUSINESS NEWS

    తదుపరి వార్తలు