ఇదే ఇండియా కొత్త మ్యాప్.. సోషల్ మీడియాలో వైరల్..

సోషల్ మీడియాలో కొత్త ఇండియా మ్యాప్ ఇదేనంటూ ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారినట్లున్న ఆ ఫోటోను మ్యాప్స్‌ఆఫ్ఇండియా.కామ్ రిలీజ్ చేసినట్లు, కాపీరైట్స్ దానికే ఉన్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 1, 2019, 5:03 PM IST
ఇదే ఇండియా కొత్త మ్యాప్.. సోషల్ మీడియాలో వైరల్..
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ మ్యాప్
  • Share this:
ఆర్టికల్ 370 రద్దు.. జమ్మూ కాశ్మీర్‌లో భారత రాజ్యాంగం అమలైంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, లడఖ్ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. భారత దేశ మ్యాప్ నుంచి ఒక రాష్ట్రం కనుమరుగు కాగా, రెండు కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలు వచ్చి చేరాయి. దీంతో.. ఇప్పటి వరకు 29 రాష్ట్రాలను కలిగిన భారత దేశం అక్టోబరు 31 నుంచి 28 రాష్ట్రాల దేశంగా మారింది. 2014 కు అంతకుముందు కూడా 28 రాష్ట్రాలు ఉండగా, తెలంగాణ అవతరించడంతో రాష్ట్రాల సంఖ్య 29కి చేరుకుంది. తాజాగా, జమ్మూ కాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లదాఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే.  అయితే, సోషల్ మీడియాలో కొత్త ఇండియా మ్యాప్ ఇదేనంటూ ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారినట్లున్న ఆ ఫోటోను మ్యాప్స్‌ఆఫ్ఇండియా.కామ్ రిలీజ్ చేసినట్లు, కాపీరైట్స్ దానికే ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం భారత దేశ చిత్ర పటం ఇదీ అని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎలాంటి చిత్ర పటాన్ని కూడా విడుదల చేయలేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాప్ ఇదే.. (twitter)


1951 నుంచి భారతదేశ చిత్రం మారుతూ వచ్చిందిలా..

First published: November 1, 2019, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading