హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇండియా భవిష్యత్తు అదే.. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు..

ఇండియా భవిష్యత్తు అదే.. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు..

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల

అతి త్వరలో ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా ఇండియా మారుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ అన్నారు. ముంబైలో జరుగుతున్న ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవో సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి ఆయన ముచ్చటించారు.

అతి త్వరలో ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా ఇండియా మారుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ అన్నారు. ముంబైలో జరుగుతున్న ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవో సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా భారత్ ఏ విధంగా దూసుకుపోతోంది? ఆర్థిక శక్తిగా ఎదగడానికి, డిజిటల్ రంగంలో రాణించడానికి దోహదపడ్డ విషయాలపై ఆయన మాట్లాడారు. ప్రఖ్యాత డిజిటల్ సమాజంగా భారత్ మారుతుందని, మొబైల్ నెట్‌వర్క్స్ పనితీరు అమోఘంగా పెరగడమే భారత పరివర్తనానికి ప్రధాన కారణమని అన్నారు. ఇంతకుముందుతో పోల్చితే భారత్‌లో మొబైల్ నెట్‌వర్క్స్ వేగంగా వృద్ధి చెందాయన్నారు. ప్రధాని మోదీ 2014లో ఇచ్చిన ‘డిజిటల్ ఇండియా’ పిలుపుతోనే భారత్ పరివర్తనం చెందడానికి కారణమైందని, అప్పుడే ఈ రంగం ఊపందుకుందని వ్యాఖ్యానించారు.

ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవో సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తర్వాత 380 మిలియన్ వినియోగదారులు జియో 4జీ టెక్నాలజీకి మారారని ముఖేశ్ అంబానీ చెప్పారు. మొబైల్ రంగంలోకి జియో కాలు పెట్టే కంటే ముందు దేశంలో సగటు డేటా స్పీడ్ 256 కేబీపీఎస్‌గా ఉండగా, జియో వచ్చాక 21 ఎంబీపీఎస్‌కు చేరిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై మాట్లాడుతూ.. గత అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా వచ్చినప్పటికి, ఇప్పటికి భారత్‌లో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఆ ప్రధాన కారణాల్లో ఒకటి మొబైల్ కనెక్టివిటీ అని స్పష్టం చేశారు.

‘ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చూసుకుంటే తొలి మూడు స్థానాల్లో భారత్ నిలుస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. అది ఐదేళ్లలో అవుతుందా? పదేళ్లలో అవుతుందా? అన్నదానిపైనే ప్రధాన చర్చ’ అని ముఖేశ్ అంబానీ తేల్చి చెప్పారు. ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా మారేందుకు భారత్‌కు గొప్ప అవకాశం ఉందని అన్నారు. కాగా, మీరు(సత్య నాదెళ్ల), నేను పెరిగిన సందర్భంలో ఉన్న ఇండియాతో పోల్చితే ముందు తరం.. కచ్చితంగా కొత్త ఇండియాను చూస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈవోతో అన్నారు.

First published:

Tags: Jio, Microsoft, Mukesh Ambani, Reliance, Reliance Industries, Satya Nadella

ఉత్తమ కథలు