• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • INDEPENDENCE DAY TELANGANA GOVERNMENT TO CELEBRATE INDEPENDENCE DAY WITH ONLY OPTIMAL NUMBER OF PARTICIPANTS THIS YEAR NK

Independence : పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం... ఇవీ రూల్స్

Independence : పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం.

Independence in Telangana : కరోనా వల్ల ఈసారి పంద్రాగస్టు వేడుకలు కాస్త ప్రత్యేకంగా జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోందో తెలుసుకుందాం.

  • Share this:
    Independence in Telangana : తెలంగాణ ప్రభుత్వం కరోనా ఉన్నప్పటికీ స్వాతంత్ర్య దినోత్సవం జరపాలని డిసైడైంది. హైదరాబాద్‌తో పాటూ... మిగతా 32 జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ఈ వేడుక జరగనుంది. రాష్ట్రవ్యాప్త వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఉదయం 10.30కి ముఖ్యమంత్రి కేసీఆర్... జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏ జిల్లాల్లో ఏ మంత్రులు జెండా ఎగరవేయాలో ఓ ఆర్డర్ జారీ చేసిన ప్రభుత్వం... జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఉదయం 10 గంటల సమయంలో జెండా వందనం జరగాలని తెలిపింది. ఎమ్మెల్యేలు, మేయర్లు ఇతరతా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించింది.

    పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం


    పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం


    కరోనా వైరస్ ఉంది కాబట్టి... పంద్రాగస్టు వేడుకల్లో అందరూ తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలనీ, సోషల్ డిస్టాన్స్ పాటించాలనీ, శానిటైజర్లు, శానిటైజర్ స్ప్రేలను అందుబాటులో ఉంచాలనీ తెలిపింది. అలాగే... వేడుకల్లో కొద్ది మంది ముఖ్యమైన వారు మాత్రమే పాల్గొనాలని కూడా చెప్పింది.
    Published by:Krishna Kumar N
    First published: