• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • INDEPENDENCE DAY SPEECH 2019 UPDATES NARENDRA MODI ENDS 90 MINUTE LONG 15 AUGUST ADDRESS WITH CHANTS OF VANDE MATARAM NK

#IndependenceDay : వందేమాతరంతో ప్రసంగాన్ని ముగించిన ప్రధాని నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ (Image : Twitter)

#IndependenceDay 2019 : రెండోసారి అధికారంలోకి వచ్చాక... తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. జమిలి ఎన్నికలు, కాశ్మీర్ అంశం అన్నింటినీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

  • Share this:
Narendra Modi Speech : త్వరలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) విధానం తెస్తామని ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 73వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరేసిన తర్వాత జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రతిసారీ లాగే... ఆరోసారీ... ప్రత్యేక తలపాగాతో కనిపించిన ఆయన... జమిలి ఎన్నికలపై అన్ని రాష్ట్రాల్లో విస్త్రృతంగా చర్చ జరగాలన్నారు. దేశం కోసం చనిపోయే అవకాశం తనకు లభించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం సమరయోధులు బ్రిటిషర్లతో చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అమరుల త్యాగాలు దేశానికి ఎప్పటికీ ఆదర్శమేనని, వారిని తలుచుకుంటే గర్వంగా ఉంటుందనీ మోదీ అన్నారు. స్వరాజ్య సంగ్రామం ఎంతో మందిని పొట్టనపెట్టుకుందనీ, వారి త్యాగాలపైనే నేటి భారతం నిర్మితమైందని గుర్తు చేశారు. మహాత్మగాంధీ, అంబేద్కర్ జీవితాలు నేటి భారతానికి ఆదర్శాలని... వారి అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో తాను పుట్టలేదన్న ఆయన... దేశం కోసం ప్రాణాలు అర్పించే అవకాశం తనకు లభించలేదని అన్నారు. దేశం కోసం జీవించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానన్నారు. భవిష్యత్ తరాలకు సమస్యలు లేని దేశాన్ని అందించాన్నదే తమ లక్ష్యమన్నారు. దేశంలో అవినీతిని నిర్మూలించి పారదర్శకతతో కూడిన బాధ్యతాయుత పాలన అందిస్తున్నామన్నారు.


ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఇండియా టాప్ 50 దేశాల్లో ఒకటిగా ఉందని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తో విదేశాల్లో కూడా భారత్ పట్ల నమ్మకాన్ని పెంచామని గుర్తుచేశారు. మౌలిక సదుపాయాల కోసం రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామన్న మోదీ... ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియాను తీర్చిదిద్దుతామన్నారు. జనాభా పరంగా ఇండియా... ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్న ఆయన... అధిక జనాభాపై అవగాహన పెంచేలా ప్రజల్లో చర్చ జరగాలని పిలుపునిచ్చారు.


దేశంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందాలన్న ఆయన... కనీసం 15 ట్రావెల్ డెస్టినేషన్లను హాలిడే స్పాట్లుగా మార్చాలన్నారు. 2022 నాటికి భారత పర్యాటకులు విదేశాలకు వెళ్లకుండా... ఇండియాలోనే ట్రావెల్ డెస్టినేషన్లు ఏర్పాటయ్యేలా చేస్తామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని రద్దు చేసుకోవాలని పిలుపిచ్చిన మోదీ... స్వచ్ఛ భారత్ దిశగా మరిన్ని అడుగులు పడాలన్నారు.
First published: