news18-telugu
Updated: August 15, 2020, 5:57 AM IST
Independence Day 2020 : నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవం... సోషల్ మీడియాలో విషెస్ (credit - twitter)
Happy Independence Day : భారత దేశం 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. బ్రిటిషర్ల నుంచి భారతీయులకు విముక్తి లభించింది కానీ ఇప్పుడు కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి లభించలేదు. ఇండియాలో కరోనా వైరస్ కేసులు బాగా పెరిగిపోవడమే కాదు... ఇప్పడు ప్రపంచంలో రోజువారీ ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నది ఇండియాలోనే కావడంతో... ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిరాడంబరంగా జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. స్కూళ్లు కూడా తెరచి లేవు కాబట్టి... విద్యార్థులు కూడా ఎవరి ఇళ్లలో వాళ్లు ఇండిపెండెంట్స్ డే జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ప్రజలు నెట్ బాట పట్టారు. సోషల్ మీడియాలో విషెస్ చెప్పుకుంటున్నారు.
ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, సినీ తారలు అందరూ సోషల్ మీడియాలోనే ఈసారి విషెస్ చెబుతున్నారు. ముఖ్యంగా ట్విట్టర్లో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. #IndependenceDayIndia హ్యాష్ ట్యాగ్‌తో ప్రజలు తమ శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈసారి నిరాడంబరంగా జరపాల్సి రావడంతో... అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ... అధికారిక ఆఫీసులు, చారిత్రక కట్టడాలు, డ్యాములు అన్నింటినీ త్రివర్ణ పతాక రంగులతో డెకరేట్ చేశాయి. ప్రజలు ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈసారి... ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర స్వాతంత్ర దినోత్సవాలని సాదాసీదాగా జరపబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.21 గంటలకు ఎర్రకోటకు వెళ్లి 7.30 గంటలకు జాతీయ జెండాను ఎగరేస్తారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనబోతున్నారు. ఈసారి విద్యార్థులు పాల్గొనడం లేదు. కొద్దిమంది అతిథుల కోసం భౌతిక దూరంతో కుర్చీలు ఏర్పాటు చేశారు. కొన్ని దేశాల దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, కరోనాను జయించిన పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు... మొత్తంగా 4 వేల మంది మాత్రమే ఈసారి వేడుకల్లో పాల్గొనబోతున్నారు.
Published by:
Krishna Kumar N
First published:
August 15, 2020, 5:57 AM IST