Video : అరుదైన పింక్ కలర్ మిడత... ఎక్కడ ఉందంటే...

మనం రకరకాల రంగుల మిడతల్ని చూస్తాం. వాటిలో ఎక్కువ శాతం గ్రీన్, బ్రౌన్, బ్లాక్, ఎల్లో కలర్ లోనే ఉంటాయి. అలాంటిది ఆ మిడత మాత్రం పింక్ కలర్‌లో కనిపించి... అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 4, 2019, 2:03 PM IST
Video : అరుదైన పింక్ కలర్ మిడత... ఎక్కడ ఉందంటే...
అరుదైన మిడత (Image : Instagram - sderryback)
Krishna Kumar N | news18-telugu
Updated: August 4, 2019, 2:03 PM IST
ఊదా రంగులో మెరుస్తున్న ఈ మిడతలు అరుదైనవి. ప్రతి 500 మిడతల్లో ఒకటి మాత్రమే ఇలాంటిది ఉంటుంది. కీటకాల్ని సేకరించే దేరీ సపూతా... చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి మిడతను మళ్లీ చూశారు. ఇలాంటి రంగు వీటికి రావడానికి కారణం జన్యుపరమైన తేడాలే. సైన్స్‌లో ఈ తేడాను ఎరిత్రిజం (Erythrism) అంటారు. ఈ విధానంలో రెడ్ కలర్ ఎక్కువ శాతం విడుదలవుతుంది. అదే సమయంలో విడుదల కావాల్సిన గ్రీన్ కలర్ సరిపడా విడుదల కాదు. అందువల్ల మిడత పింక్ కలర్‌లో కనిపిస్తుంది. ఈ తరహా మిడతలు చాలా పెద్దగా, ఆకుల ఆకారంలో ఉంటాయి. సాధారణంగా ఇవి గ్రీన్ కలర్‌ల ఉంటాయి. ఫలితంగా ఇవి చుట్టూ ఉన్న పరిసరాల కలర్‌లో కలిసిపోతాయి. అందువల్ల శత్రువుల కంట పడకుండా తప్పించుకుంటాయి. పింక్ మిడతలు మాత్రం చుట్టూ మొక్కల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందువల్ల ఇలాంటివాటిని శత్రువులు తినేస్తాయి. అందుకే వీటి సంఖ్య తక్కువగా ఉంటోంది.



 




Loading...

View this post on Instagram





 

A post shared by sdb insect (@sderryback) on





సపూతా అప్‌లోడ్ చేసిన వీడియోలో... బ్యూటీఫుల్ పింక్ మిడత... అతని చేతులపై వాలి... ప్రశాంతంగా ఉంది. దాన్ని ఆయన వీడియో తీశారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇలాంటి అరుదైన కీటకాలు చాలా ఉన్నాయి.
First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...