Home /News /trending /

IN VALENTINE WEEK A PERSON IS ROAMING AROUND WITH THE BOARD OF BOYFRIEND ON RENT PVN

Boyfriend On Rent : వాలంటైన్స్ డే స్పెషల్..అద్దెకు బాయ్ ఫ్రెండ్

అద్దెకు బాయ్ ఫ్రెండ్

అద్దెకు బాయ్ ఫ్రెండ్

Boyfriend On Rent : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రియాన్షు "అద్దెకు బాయ్ ​ఫ్రెండ్​" అనే ప్లకార్డుతో వీధి వీధి తిరుగుతూ ప్రేమ సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. వాలెంటైన్స్ వీక్ వేడుకలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు.

ఇంకా చదవండి ...
Valentine's day :  ప్రేమికులు అత్యంత ఇష్టపడే వాలెంటైన్స్ డే (Valentine’s Day)సీజన్ వచ్చేసింది. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపర్చడానికి ఇదే సరైన సమయం. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ ప్రేమను తెలియజేస్తుంటారు. ముఖ్యంగా వస్తువు రూపంలో గిఫ్ట్ ఇచ్చి తమ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరుస్తుంటారు. వాలెంటైన్స్ వీక్ వేడుకలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. అయితే బీహార్​ లోని దర్భంగాలో ఇప్పుడు ఎక్కడ చూసినా అద్దెకు బాయ్ ఫ్రెండ్(Boyfriend on rent)అనే ప్లకార్డులతో ఓ యువకుడు దర్శనమిస్తున్నాడు. నగరంలోని ప్రతి ప్రాంతంలో ఈ ప్లకార్డును ప్రదర్శిస్తూ తిరుగుతున్నాడు. ఆ యువకుడు ఎందుకు ఇలా ప్లకార్డు ప్రదరిస్తూ తిరుగుతున్నాడో చూద్దాం.

బీహార్ రాష్ట్రంలోని దర్భంగాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రియాన్షు "అద్దెకు బాయ్ ​ఫ్రెండ్​" అనే ప్లకార్డుతో వీధి వీధి తిరుగుతూ ప్రేమ సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. నగరంలోని రాజ్ ​కోట్​, చర్చి, దర్భంగా టవర్​, బిగ్ ​బజార్​ లాంటి రద్దీ ప్రాంతాల్లో ఈ ప్లకార్డును ప్రదర్శిస్తున్నాడు ప్రియాన్షు. తాము ఒంటరిగా ఉన్నామని భావించే వారి ముఖంలో చిరునవ్వు చూడాలని ఇలా ప్లకార్డుతో ప్రదర్శన చేస్తున్నట్లు ప్రియాన్షు చెబుతున్నాడు.

ALSO READ Hijab Row: హిజాబ్‌ను తాకితే చేతుల్ని తెగనరుకుతాం: ఎస్పీ రుబీనా వార్నింగ్, దుమారం

యువత ప్రేమ, ఇతర వ్యవహారాల్లో సమయం వృథా చేయకుండా తమ విలువైన సమయాన్ని దేశం కోసం కేటాయించాలన్న ఉద్దేశంతోనే ఇలా వినూత్నంగా ప్రదర్శన చేపట్టినట్లు ప్రియాన్షు చెబుతున్నారు. ప్లకార్డుతో తిరుగుతున్న ప్రియాన్షు ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.  కాగా,దర్భంగా ఇంజినీరింగ్ కాలేజీలో ఐదో సెమిస్టర్ చదువుతున్న ప్రియాన్షు..గతంలో క్రిస్​మస్ సందర్భంగా "ఫ్రీ హగ్​" పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించగా..దీనికి విపరీతమైన ఆదరణ వచ్చింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bihar, Lovers, Valentines day, Youth

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు