Home /News /trending /

IN UTTAR PRADESH A NEWLYWED WHO WANTS TO DIVORCE HER HUSBAND KNOWING THAT HE IS FROM A VILLAGE DOES NOT WANT TO GO WITH HIM SNR

మూడు ముళ్లు వేసిన తర్వాత మొగుడు వద్దంది..వామ్మో ఆ లోపం చూపించింది

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Viral News:పెళ్లి జరిగింది. బంధువులు కూడా ఇంకా పెళ్లి ఇంట్లోంచి వెళ్లలేదు. కానీ కాపురానికి వెళ్లాల్సిన ఆ నవవధువు షాకింగ్ న్యూస్ చెప్పింది. కొత్త పెళ్లికొడుకుతో కాపురానికి వెళ్లనంటూ తెగేసి చెప్పింది. కారణం తెలిసి అంతా షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...
వివాహ వేడుకల్లో కట్నకానుకల సమస్య, లేదంటే పెట్టిపోతల దగ్గర గొడవలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోవడం చూశాం. కానీ ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి తంతు ముగిసిన తర్వాత కొత్త సమస్య తలెత్తింది. దాంతో పెళ్లి కూతురు ఈ పెళ్లి కొడుకు నాకు వద్దు..అతనితో కాపురానికి వెళ్లనంటూ భీష్మించుకుంది. వివాహం జరిగిన తర్వాత పెళ్లి కూతురు ప్రవర్తించిన తీరు చూసి అమ్మాయి, అబ్బాయి తరపు బంధువులతో పాటు వివాహం చూసేందుకు వచ్చిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ నవ వధువు పెళ్లి కొడుకుతో కాపురానికి ఎందుకు వెళ్లనంది అంటే ఆ కుర్రాడు ఓ పల్లెటూరుకి చెందిన వాడు అని తెలియడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ఇటావా (Etawah)జిల్లాకు చెందిన విపిన్‌కుమార్‌(Vipin kumar)తో డోలీ (Dholi)అనే అమ్మాయితో వివాహం జరిగింది. బంధు, మిత్రుల సమక్షంలో వారి సంప్రదాయ పద్ధతిలో గ్రాండ్‌గా పెళ్లి(Marriage), రిసెప్షన్ (Reception)కూడా ముగిసింది. చివరకు అప్పగింతల సమయంలో పెళ్లి కూతురు(Newlywed) తల్లిదండ్రులు తమ బిడ్డను అత్త,మామలకు అప్పగించే సమయంలో ట్విస్ట్‌ బయటపడింది. వరుడు విపిన్‌కుమార్‌ ఓ మారుమూల గ్రామంలో నివసిస్తున్నాడని..అక్కడ ఎలాంటి లగ్జరీ సౌకర్యాలు లేవని తెలిసి కాపురానికి వెళ్లేందుకు నిరాకరించింది డోలి. బంధు,మిత్రుల సమక్షంలో ఎంతో గొప్పగా వివాహం జరిపించిన వధువు తల్లిదండ్రులు ఈవార్త విని షాక్ అయ్యారు, కొత్త పెళ్లికూతురు డోలీకి నచ్చజెప్పేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. నిదానంగా అన్నీ చక్కదిద్దుకుంటాయని..కాపురానికి వెళ్లిన తర్వాత అన్నీ అలవాటు అవుతాయంటూ చాలా మంచి మాటలు చెప్పారు. ఎవరెన్ని చెప్పినా కొత్త పెళ్లి కూతురు మనసు మార్చుకోలేదు.

వాళ్ల పెళ్లి పెటాకులైంది..
పెళ్లి కూతురు తరపు వాళ్లంతా ఆమెను కాపురానికి పంపేందుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఫలితం లేకపోవడంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. నలుగురికి తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అని అదే విషయాన్ని బయటకు రానివ్వకుండా పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్లు కూడా పెళ్లి తర్వాత అమ్మాయి మాట్లాడిన మాటలు, కేవలం పల్లెటూరు కాబట్టి కాపురానికి రానంటున్న కోడలి మనస్తత్వం తెలిసి ఆశ్చర్యపోయారు. అయితే పెళ్లి జీవితంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి వాళ్లు కూడా ఓ మెట్టుదిగి అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. పెళ్లికి అయిన ఖర్చులు తామే భరిస్తామని..అమ్మాయికి మెట్టినింట్లో ఎలాంటి సౌకర్యాలు కావాలో తెలుసుకొని ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు.

పల్లెటూరు కాపురానికి వెళ్లనన్న సిటీ అమ్మాయి..
ఇంత జరిగిన తర్వాత కూడా ఆ మోడ్రన్‌ యువతి పెళ్లి కొడుకుతో ఆ గ్రామీణ ప్రాంతానికి వెళ్లేందుకు అంగీకరించలేదు. పంచాయతీ పరిష్కారం కాకపోవడంతో పెళ్లికి వచ్చి ఆశీర్వదించిన బంధువులు, వివాహ తంతుకు సాక్ష్యంగా నిలిచిన రెండు వైపుల పెద్ద మనుషులు, గ్రామస్తులు తలలు పట్టుకున్నారు. పోలీసులు మాత్రం ఈపెళ్లి రద్దు విషయంలో తమకు ఎలాంటి సమాచారం అందలేదని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పెళ్లి జరిగినప్పటికి కొత్త పెళ్లికూతురు పుట్టింట్లోనే ఉంది. ఆమెను కాపురానికి తీసుకెళ్లేందుకు మెట్టినింటి వాళ్లు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Uttar pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు