హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

నవరాత్రి వేడుకల స్పెషల్... చీరలు ధరించి పురుషుల గర్భా నృత్యం.. ఎందుకంటే..

నవరాత్రి వేడుకల స్పెషల్... చీరలు ధరించి పురుషుల గర్భా నృత్యం.. ఎందుకంటే..

చీరలు వేసుకున్న పురుషులు

చీరలు వేసుకున్న పురుషులు

Gujarat: నవరాత్రి వేడుకలకు అక్కడ పురుషులంతా చీరలు ధరించి అక్కడి ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తుంటారు. పురుషులకు అది ఎంతో సెంటిమెంట్ కూడా భావిస్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

దేశ వ్యాప్తంగా అమ్మవారి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టిస్తున్నారు. తొమ్మిదిరోజులపాటు భక్తితో ఉపవాసం ఉంటూ ఆ అమ్మవారిని కొలుచుకుంటారు. అమ్మవారు తొమ్మిది రోజుల పాటు రోజుకో రూపంలో భక్తులను అనుగ్రహిస్తు భక్తుల బాధలను దూరంచేస్తుందని నమ్ముతుంటారు. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల నవరాత్రి వేడుకలో స్థానికంగా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లోని (Gujarat)  గర్భా నృత్యం ఫెమస్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే... అక్కడ అహ్మదాబాద్ లోని పాతబస్తీలో పురుషులు నవరాత్రి వేడుకలు రాగానే చీరలు కట్టుకుని మరీ గర్భాడ్యాన్స్ చేస్తారు. అయితే.. అక్కడ నవరాత్రి వేడుకలలో ఎనిమిదవ రోజున బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ 200 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దీనివెనుక ఒక పురాణ గాథ ఉంది. కాగా, సదుబా అనే మహిళ తన బిడ్డను, ఎవరో పురుషుడి వలన పొగొట్టుకుంది.

దీంతో ఆమె పురుషులకు శాపం పెట్టింది. దీంతో అక్కడి వారు.. సదుబా చనిపోయాక ఆమెకు గుడికట్టించారు. అంతే కాకుండా... ఆలయాన్ని సందర్శించే పురుషులు తప్పినసరిగా చీరలు ధరించి వెళ్లాలి. అక్కడు పురుషులు వెళ్లి ప్రార్థన చేసి, ఆమెకు క్షమాపణ కోరతారు. ఈ సంప్రదాయం 200 ఏళ్ల నాటిదని నమ్ముతారు 200 సంవత్సరాల క్రితం తమను శపించిన సదుబా నుండి పురుషులు క్షమాపణ కోరతారు. అష్టమి రోజున, నగరం నలుమూలల నుండి వందలాది మంది బారోట్ కమ్యూనిటీకి చెందిన వారు సాదు మాతా ని పోల్ వద్ద సదు మాతకు తమ నమస్కారాలు చెల్లించడానికి సమావేశమవుతారు. అక్కడ చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఈ ఘటన వార్తలలో నిలిచింది. నవదుర్గ ఆరాధనకు అంకితం చేయబడిన నవరాత్రులు సెప్టెంబర్ 26న ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తాయి. నవరాత్రులు మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Gujarat, VIRAL NEWS

ఉత్తమ కథలు